సూపర్‌స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెలుగు తెరకు పరిచయమైన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. పండగ సమయం కావడంతో బాక్సాఫీస్ దగ్గర బాగానే కాసులు కురిపించింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఈరోజు ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ మూవీలో గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. గల్లా అశోక్‌కి ‘హీరో’ మూవీ తొలి సినిమానే అయినా ఎక్కడా తెరపై ఆ విషయం తెలియలేదని రివ్యూలు వచ్చాయి. అర్జున్ పాత్రలో గల్లా అశోక్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు లభించాయి. ఈ మూవీ అమర్‌రాజా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. ‘దేవదాస్’ ఫేం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. జిబ్రాన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో జగపతిబాబు, నరేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు.