OTT Updates: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ లాభాలను మూటగట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 5న విడుదలైంది. తాజాగా ఓటీటీ అప్‌డేట్‌ను జీ5 ప్రకటించింది. దీపావళి కానుకగా ఈనెల 21న బింబిసార మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
Read Also: లూసిఫర్ Vs గాడ్ ఫాదర్.. అక్కడెవరు.. ఇక్కడెవరు
కాగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో 500 బీసీ కాలంలో త్రిగర్తల రాజ్యంలోని సరిహద్దు ప్రాంతంలో నివసించిన బింబిసారుడు కథ ఆధారంగా బింబిసార సినిమాను దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించాడు. ఈ మూవీలో కళ్యాణ్‌రామ్ ద్విపాత్రాభినయం చేయగా.. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు. మరోవైపు బింబిసార మూవీ రెండో భాగానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెకండ్ పార్టులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తాడని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.