కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’లో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అలానే క్లయిమాక్స్ లో సూర్య ఎంట్రీ ఇచ్చి, మూవీ గ్రాఫ్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్ళాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. తెలుగులోనూ ‘విక్రమ్’ చక్కని విజయాన్ని సొంతం చేసుకుని, కమల్ సత్తాను టాలీవుడ్‌లో మరోసారి చాటింది.
Read Also: Mahesh Babu: ఒకే ఫ్రేములో బిల్‌గేట్స్, మహేష్‌బాబు
సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం ఈ ఘన విజయానికి ప్రధాన కారణం. అలానే కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ముగ్గురూ తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. ఈ సూపర్ హిట్ మూవీని ఓటీటీలో ఎప్పుడెప్పుడూ చూద్దామా అని కమల్ అభిమానులు ఆశపడుతున్నారు. వారి ఎదురుచూపులకు తెర దించుతూ, ఆ విషయమై తాజా ప్రకటన వచ్చింది. ఈ సూపర్ హిట్ మూవీ జూలై 8 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
A super hit addition to your watchlist coming soon! 😍
Vikram: Hitlist streaming from July 8 in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. #VikramOnDisneyPlusHotstar 🔥😎 pic.twitter.com/bCO3KfVcOK
— Disney+ Hotstar (@DisneyPlusHS) June 29, 2022