Mallikarjun Kharge: గ్యాస్ ధర తగ్గింపుపై విమర్శలు.. ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించిన ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించడంపై రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ.. రక్షా బంధన్‌కు ముందు దేశంలోని సోదరీమణులకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి అని అటుండగా.. మరోవైపు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష కూటమి ఎన్నికల బహుమతిగా విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇది ఎన్నికల లాలీపాప్‌గా అభివర్ణించారు. అది ఇప్పట్లో పనికి రాదని అన్నారు. ఎప్పుడైతే బీజేపీకి ఓట్లు తగ్గుతాయో.. ఎన్నికల కానుకల పంపిణీ మొదలైందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది తల్లులు మరియు సోదరీమణుల కోసం చూపించే గుడ్‌విల్ అని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1100కి పెంచిందని తెలిపారు. ద్రవ్యోల్బణం సామాన్యుడి జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మీకు ఏ బహుమతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
Also Read
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
200 రూపాయల సబ్సిడీ ఇచ్చి దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల కోపాన్ని తగ్గించలేమన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని ఖర్గే సూచించారు. ఈసారి ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు బీజేపీకి మార్గాన్ని చూపడం ఒక్కటే ఆప్షన్‌గా ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో కేవలం రూ.500లకే పేదలకు సిలిండర్లు ఇవ్వబోతోందని.. ఇది రాజస్థాన్‌లో కూడా అమలు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను విపక్షాలు చూస్తున్నాయి. అయితే ఇది రక్షా బంధన్ నాడు దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, సోదరీమణులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన కానుక అని అధికార పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
Allu Arjun: బన్నీ ఫాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. ఇండియాలోనే తొలిసారిగా?
మరోవైపు ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 న ప్రతిపక్ష కూటమి (ఇండియా) యొక్క మూడవ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ముంబైలో జరుగనుండగా.. ద్రవ్యోల్బణంతో సహా అనేక అంశాలపై వ్యూహరచనతో పాటు, కన్వీనర్ పేరును కూడా ప్రకటించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విపక్ష కూటమికి భయపడిపోయిందని, అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
जब वोट लगे घटने, तो चुनावी तोहफ़े लगे बटने !
जनता की गाढ़ी कमाई लूटने वाली, निर्दयी मोदी सरकार, अब माताओं-बहनों से दिखावटी सद्भावना जता रही है।
साढ़े 9 सालों तक ₹400 का #LPG सिलेंडर, ₹1100 में बेच कर, आम आदमी की ज़िंदगी तबाह करते रहे, तब कोई “स्नेह भेंट” की याद क्यों नहीं…
— Mallikarjun Kharge (@kharge) August 29, 2023
- Tags
- bjp
- congress
- gas price
- Kharge
- opposition
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!