కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ.. మే 6, 7 తేదీలలో భారత సైన్యం జైషే, హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో ఆయన వివరించారు. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఉగ్రవాదులను సృష్టిస్తున్నారని కల్నల్ సోఫియా అన్నారు. పాకిస్తాన్, పీఓకేలలో తొమ్మిది లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేసాము. లాంచ్ప్యాడ్లు, శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా దాడులు జరిపామని అన్నారు. 25 నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ జరిగింది.. Also Read:Vikram Misri: పాక్ ప్రపంచాన్ని…
China Terms India's Strikes: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశానికి చెందిన సైన్యం జరిపిన దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాయాది దేశంపై ఇండియా దాడి చేయడం విచారకరం అని అభివర్ణించారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత సైన్యం నిన్న రాత్రి పాకిస్తాన్కు గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి మిస్రీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అర్థరాత్రి 1. 05 నుంచి 1. 30 మధ్య ఆపరేషన్…
పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి కుటుంబాల్లో శోకాన్ని నింపిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రెడీ అయ్యింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత దళాలు వైమానిక దాడులు నిర్వహించి తిరిగి వచ్చాయి. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రకటించాయి. అయితే పాకిస్తాన్లో భారత వైమానిక మొదటి దాడి జరిగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. Also…
CM Revanth Reddy: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా ఇతర కీలక విభాగాల ఉన్నతాధికారులు హాజరవుతారు. తాజా పరిస్థితులను…
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత్ ఇలాగే దాడులు కొనసాగించాలని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ వేదిగా పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన భారత ఆర్మీ.. పాక్ పై మెరుపుదాడులు.. భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇప్పటి వరకు భారత ఆర్మీ ధ్వంసం…
భారత్ సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఈ హెడ్క్వార్టర్ ఉంది. సుమారు, 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్, మర్కజ్ తైబా, మురిద్కే, సర్జల్ / టెహ్రా కలాన్, మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్కోట్, మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భీంబర్, మర్కజ్ అబ్బాస్, కోట్లి, మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్లోని షావాయి నల్లా క్యామ్, మర్కజ్ సయ్యద్నా బిలాల్ లో మెరుపు దాడులు చేసింది. భారత్ చేపట్టిన ఈ ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్…