ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి ప్రాణాలు తీయడంతో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ముక్తకంఠంతో నినదించింది. తాజా దాడులతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత వైమానిక దాడులపై స్పందించారు. Also Read:Ind-Pak Tensions To…
ప్రధాని మోడీని, భారతదేశాన్ని నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తానంటూ మసూద్ అజహర్ లేఖలో ప్రస్తావించారు.
Ind-Pak Tensions To Impact IPL: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తామ్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించాయి. వైమానిక దాడి తర్వాత, ముజఫరాబాద్‌లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నాశనమైంది. భారత వైమానిక దాడిలో, జైషే మహ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా, నలుగురు అనుచరులు కూడా…
ఇండియాకు ఇజ్రాయెల్ బాసట.. దాడులు కొనసాగించాలని సూచన! పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి…
Terror Sites: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ దాడులు చేసింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని 9 ప్రదేశాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైనిక చర్య జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయాలతో సహా 9 ప్రదేశాలను ధ్వంసం చేసింది. భారత సైనిక దళాలు చేసిన ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అణ్వాయుధ దాడి చేస్తామని, బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. యుద్ధం ఆపండి…
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌కు బిగ్ షాక్ తగిలింది. పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 బుధవారం తెల్లవారుజామున ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు ( 6 శాతం) మేర నష్టపోయింది. అయితే, మంగళవారం ముగింపు స్థాయి 113,568.51 నుంచి 107,296.64 కనిష్ట స్థాయికి పడిపోయింది.