Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇన్నాళ్లు తాము పెంచుకుంటున్న ఉగ్రవాదులను భారత్ బహిర్గతం చేసింది. ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలను సేకరించి మీర దెబ్బ కొట్టింది. పీఓకేతో పాటు పాక్ ప్రధాన భూభాగాల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్దిన్‌కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఇప్పుడు అందరిలో వస్తున్న ప్రశ్న ఏంటంటే.. భారత్ క్షిపణులతో దాడులు చేస్తుంటే పాకిస్తాన్‌లో ఉన్న రాడార్లు ఎందుకు గుర్తించలేదు. దీనికి కారణం అవి చైనాకు చెందిన రాడార్లు కావడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ క్షిపణుల్ని అడ్డుకోలేకపోయింది. బుధవారం తెల్లవారుజామున భారత్ ప్రయోగించిన క్షిపణులు ఒక్కొక్క ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసుకుంటు వెళ్తుంటే పాక్ సైన్యం చూడటం తప్ప ఏం చేయలేకపోయింది.
Read Also: Indian Military Trains: భారతీయ ‘సైనిక రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా?
భారత్ రాఫెల్ ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన స్కాల్ప్, హామర్ మిస్సైళ్లు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించలేదు. పాకిస్తాన్ గగనతలాన్ని HQ-9, LY-80 (HQ-16) డిఫెన్స్ సిస్టమ్స్ కాపాడుతున్నాయని భావిస్తున్నారు. రష్యా S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కి HQ-9 కాపీగా భావిస్తారు. గాలిలో శత్రు క్షిపణుల్ని గుర్తించి, వాటిని అడ్డుకునే సామర్థ్యం ఉందని పాకిస్తాన్ తరుచుగా చెబుతుంది. ఆపరేషన్ సిందూర్‌లో మాత్రం ఈ వ్యవస్థ ఒక్క క్షిపణిని కూడా గుర్తించలేకపోయింది.
భారతదేశం అధునాతన ఎలక్ట్రానికి వార్ ఫేర్ పద్ధతులు- డెకాయిస్, సిగ్నల్ సప్రెషన్, రాడార్ జామింగ్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ నిష్ప్రభావంగా మారింది. బహవల్పూర్, మురిడ్నే, ముజఫరాబాద్‌లో పాకిస్తాన్ అత్యంత విలువైన ఉగ్ర ఆస్తులపై భారత్ దర్జాగా దాడులు చేస్తుంటే, పాక్ రక్షణ వ్యవస్థ అంతా మూగబోయింది.
చైనీస్ రాడార్లు ఇప్పుడే కాదు పలు సందర్భాల్లో క్షిపణులు, శత్రు విమానాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. 2011లో యూఎస్ నేవీ సీల్స్ అబోటాబాద్‌లో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ని మట్టుపెట్టిన సమయంలో, 2019లో భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు, 2022లో భారత బ్రహ్మోస్ మిస్సైల్ మిస్ ఫైరయి పాకిస్తాన్ లోకి వెళ్లినప్పుడు చైనా రక్షణ వ్యవస్థలు విఫలయమ్యాయి. దూసుకువస్తున్న స్కాల్ప్ క్షిపణిని ట్రాక్ చేయడంలో HQ-9 వ్యవస్థ దారుణంగా విఫలమైంది. చైనా అంటే చీప్ ప్రోడక్ట్ అని మరోసారి తేటతెల్లమైంది.