CM Revanth Reddy : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 8 గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్ అనంతరంగా ఏర్పడిన పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు.
Balochistan: ‘‘బలూచిస్తాన్ ఎప్పుడో పాకిస్తాన్ చేజారింది’’.. మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అత్యవసర సేవల నిలిపివేతకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కొరత తలెత్తకుండా చూడాలని సూచించారు. అలాగే, రక్షణ రంగ సంస్థలు, శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణను సందర్శించనున్న వ్యక్తులకు తగిన భద్రత కల్పించాలి, కేంద్ర నిఘా సంస్థలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం సాధించాలన్నారు.
Operation Sindoor: చైనా ప్రొడక్ట్స్ నమ్మెద్దు బ్రో.. భారత్ క్షిపణుల్ని గుర్తించని చైనీస్ రాడార్లు..