Operations Sindoor : పాక్ పరువు పోయింది.. మేం ఏం చేయలేం అంటూ వీడియోలు
- భారత దాడులతో పాక్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
- లక్ష్యాన్ని తాకిన 24 మిస్సైళ్లను అడ్డుకోలేని పాక్ రక్షణ వ్యవస్థ
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై పౌరుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operations Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్‌లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్‌ను వారు ప్రయోగించినా, వాటిలో ఒక్కదాన్ని కూడా మా సైన్యం నిలువరించలేకపోయింది. మా దేశం ఏ మాత్రం ప్రతిస్పందించలేకపోయింది” అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారతదేశం ఉగ్రవాదుల శిబిరాలపైనే దాడి చేసిందని, ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
CM Revanth Reddy : భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
“పాక్ స్థావరాలపై దాడి చేసిన తర్వాత మేం చేసేది ఏమీ లేదు. మా బలహీనతను ప్రపంచం ముందు భారత్ చాటి చెప్పింది” అని ఆయన ఆవేదన చెందారు. దేశంలోని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో, భారత యుద్ధ విమానాలను కూల్చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. “వాస్తవానికి జరిగింది వేరు. మా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఈ దాడులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ వైఫల్యం అక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ దేశ రక్షణ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయ పరిస్థితులను మరింత అస్థిరపరిచే అవకాశం ఉంది.
Guntur Crime: ట్రాంజెండర్‌తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!