జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత తాజాగా భారత్ ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా దళాలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు.
READ MORE: Balochistan: ‘‘బలూచిస్తాన్ ఎప్పుడో పాకిస్తాన్ చేజారింది’’.. మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
ఉగ్రవాదులకు మద్దతిచ్చి దాడులకు సహకరిస్తున్న వారిని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాద సంస్థలు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేసేవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రదాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు 100కు పైగా ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. ఉగ్రదాడిలో భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, సాక్షుల సమక్షంలో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు అమిర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అమిర్ ఉగ్రవాదులకు పరికరాలు సప్లై చేసేశాడు.