Congress: ప్రధాని నరేంద్రమోడీని అవమానించే విధంగా కేరళ కాంగ్రెస్ యూనిట్ ‘‘ఒకే దేశం-ఒకే భర్త’’ అనే ట్యాగ్‌లైన్‌తో చేసిన ట్వీట్ రాష్ట్రంలో కొత్త వివాదానికి కారణమైంది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసియబడిన ఈ పోస్ట్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. కాంగ్రెస్ హిందూ ఆచారాలను టార్గెట్ చేస్తోంది, అగౌరవపరుస్తోందని, బుజ్జగింపు రాజకీయాల్లో పాల్గొంటోందని కేరళ బీజేపీ, కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించింది.
సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పేరు ప్రఖ్యాతల కోసమో తెలియదు గానీ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మధ్య హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టై జైల్లో ఊచలు లెక్కడుతోంది. తాజాగా లా విద్యార్థిని తన స్థాయి మరిచి ప్రవర్తించింది. దీంతో ఆమె కూడా ఇరాటకంలో పడింది.
Global Optimism Index: జాతీయ ఆశావాదంలో భారతదేశం ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వార భారతీయల్లో ఆశావాద దృక్పథం పెరిగిందని ఇప్సోస్ ‘‘వాట్ వర్రీస్ ది వరల్డ్’’ సర్వే చెప్పింది. మే 2025 ఎడిషన్‌లో భారత్ మూడు శాతం పాయింట్లు ఎగబాకి జాతీయ ఆశావాదంలో గణనీయమైన పెరుగుదల నివేదించినట్లు చెప్పింది. ప్రపంచంలోనే సింగపూర్, మలేషియా, ఇండోనేషియా తర్వాత ‘‘గ్లోబల్ ఆప్టిమిజం ఇండెక్స్’’లో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్…
Shahid Afridi: దుబాయ్‌లో కేరళ గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి అతిథులుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ రావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్‌లోని కేరళ కమ్యూనిటీపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వ్యతిరేకి అయిన షాహిద్ అఫ్రిదిని ఆహ్వానించడంపై భారత సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
PM Modi: పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు భారతదేశ ‘‘నారీ శక్తి’’ని తక్కువగా అంచనా వేసి తమ వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మహిళల ముందే భర్తల్ని ఉగ్రవాదులు చంపారు. ఈ సంఘటనలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాదంపై భారతదేశ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ అతిపెద్ద విజయవంతమైన చర్యగా ప్రధాని ప్రకటించారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో నష్టాల గురించి తొలిసారిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ స్పందించారు. నాలుగు రోజులు సంఘర్షణ అణుయుద్ధం స్థాయికి చేరుకోలేని ఆయన చెప్పారు. భారత ఫైటర్ జెట్స్ కూలిపోయాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ విషయం ఏంటంటే, జెట్ కూలిపోవడం కాదు, కానీ అవి ఎందుకు కూలిపోతున్నాయనేదే ముఖ్యం’
మే 31న అంటే శనివారం పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు అధికారులు. భారత్ లో జరగనున్న ఈ మాక్ డ్రిల్ ముందు పాకిస్తాన్లో భయానక వాతావరణం నెలకొంది. పాకిస్తాన్‌లోని అన్ని మీడియా ఛానెళ్లలో, ఈ మాక్ డ్రిల్‌ను భారత్ కొత్త చర్యతో ముడిపెడుతున్నారు. పాకిస్తాన్ సైన్యంలోని ప్రముఖ జర్నలిస్టులు, మాజీ అధికారులు అణు దాడి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. Also Read:GT vs MI IPL 2025 Eliminator: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్..…
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది.
నిన్న జైహింద్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను, పాక్ కీలకమైన సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన…
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణులు మన దేశ శత్రువులకు నిద్ర లేకుండా చేశాయని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ర్యాలీ నిర్వహించారు.