Shashi Tharoor: పాకిస్తాన్ తీరును మరోసారి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి విదేశాలకు వివరించే భారత దౌత్య బృందానికి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌతో సమావేశమైంది. అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను గుర్తించి, నిర్మూలించడానికి అమెరికాకు సహాయం చేసిన వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రిది పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును థరూర్ విమర్శించారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్‌మెన్ సోషల్ మీడియాకు ప్రతిస్పందనంగా థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ అఫ్రిది విడుదల కోసం ఒత్తిడి తీసుకురావాలని అమెరికాలో ఉన్న పాకిస్తాన్ డెలిగేషన్‌ని షెర్‌మెన్ కోరారు.
Read Also: French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
థరూర్ స్పందిస్తూ.. “పాకిస్తాన్ ఉగ్రవాద సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌కు (కంటోన్మెంట్ నగరంలోని ఆర్మీ క్యాంప్ సమీపంలోని సురక్షితమైన ఇంట్లో!) ఆశ్రయం కల్పించడమే కాకుండా, అమెరికన్లకు అతని స్థానాన్ని తెలిపిన ధైర్యవంతుడైన వైద్యుడిని అరెస్టు చేసి శిక్షించిన దేశం అని బ్రాడ్ షెర్‌మన్ గుర్తు చేశారు. పాకిస్తాన్‌లో మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు ప్రతిఫలం పొందుతారు, ఉగ్రవాదులను బహిర్గతం చేసినందుకు హింసించబడతారు!” అని అన్నారు. డాక్టర్ షకీల్ అఫ్రిది అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికా వేటాడటంలో అమెరికాకు సహకరించారు. పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుకు చెందిన ఆరోగ్య అధికారి అయిన అఫ్రిదిని 2008లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే ఇస్లాం కమాండర్ మంగళ్ బాగ్ అపరిచాడు.