Operation Sindoor: 19 బ్రహ్మోస్ మిస్సైల్స్, S-400 సిస్టమ్స్‌లతో పాకిస్తాన్‌లో విధ్వంసం.. ‘‘సిందూర్’’ సాగింది ఇలా..
- 19 బ్రహ్మోస్ క్షిపణులు, ఎస్-400తో పాకిస్తాన్‌లో విధ్వంసం..
- పాక్ ఎయిర్ బేస్‌లతో సహా ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు..
- ఆపరేషన్ సిందూర్‌లో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అయితే, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. భారత్ చెప్పినదాని కన్నా దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ పత్రాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించి ఒక నెల గడవడంతో నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్, మిలిటరీ అధిపతులు శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 6 క్రిస్టల్ మేజ్ క్షిపణులతో పాకిస్తాన్ మురిడ్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని 6-7 స్కాల్ప్ క్షిపణులతో భారత్ నేలమట్టం చేసినట్లు తెలిసింది. ఆపరేషన్ సమయంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధ విమానాలు, సర్ఫేస్ టూ ఎయిర్(ఎస్ఏఎం) క్షిపణులు, ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థలు నాలుగు పాకిస్తాన్ నిర్మిత యుద్ధ విమానాలను, రెండు పెద్ద విమానాలు (బహుశా సీ-130జే, సాబ్ 2000 అవాక్స్ సిస్టమ్)ని కూల్చివేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
పాకిస్తాన్‌లోని సర్గోద, రఫికి, జకోబాబాద్, నూర్ ఖాన్ (చక్లాలా, రావల్పిండి)తో సహా 11 పాక్ ఎయిర్ బేస్‌లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడుల్లో 2 ఎఫ్-16 యుద్ధ విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంఘర్షణలో ఎస్-400 సిస్టమ్ మూడు శత్రు విమానాలను కూల్చేసింది. మే 10న జరిగిన ప్రతీకార దాడిలో పాకిస్తాన్ చక్లాలా నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లోని ఒక చైనీస్ LY-80 ఫైర్ రాడార్, రెండు AN/TPQ-43 US-నిర్మిత ఆటోమేటిక్ ట్రాకింగ్ రాడార్‌లు మరియు చైనీస్ HQ-9 రాడార్ యొక్క ఒక ఫైర్ యూనిట్‌ను ధ్వంసమైనట్లు సమాచారం.
Read Also: Tragedy : సె*క్స్‌కు ఒప్పుకోలేదు.. అందుకే చంపేశాం.. సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం కేసులో సంచలనం
పాకిస్తాన్ భారత్‌పైకి చైనీస్ తయారీ 180 కి.మీ పరిధిని కలిగి ఉన్న PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని ప్రయోగించింది. అయితే, భారత రక్షణ వ్యవస్థలు వీటిని అడ్డుకున్నాయి. భారత్ 19 బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని, అంతే సంఖ్యలో స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణలను ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ చైనీస్ తయారీ JF-17 యుద్ధ విమానాలను ఉపయోగించి భారత వైమానిక స్థావరాలపై CM-400 AKG వైమానిక-ప్రయోగించిన సూపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించారు. అయితే, ఇవి మనకు ఎలాంటి నష్టాలను కలిగించలేకపోయాయి.
పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో ప్రయోగించిన టర్కీ-నిర్మిత YIHA లాయిటరింగ్ మందుగుండు సామగ్రిని భారత ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ జామ్ చేసింది. దీంతో వాటి లక్ష్యాలు తప్పిపోయాయి. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు వీటిని కూల్చేశాయి. పాకిస్తాన్ ప్రయోగించిన ఫతే-1 క్షిపణిని కూడా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి.
మే 7న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ జరిపిన దాడిలో మర్కజ్-ఎ-తైబా (మురిడ్కేలోని ఎల్‌ఇటి ప్రధాన కార్యాలయం) నాలుగు నుండి ఐదు క్రిస్టల్ మేజ్ క్షిపణులను ఉపయోగించింది. మర్కజ్-ఎ-సుభాన్ అల్లాహ్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరంపై రాఫెల్ యుద్ధ విమానాల నుండి ప్రయోగించబడిన ఆరు స్కాల్ప్ క్షిపణులు దాడి చేశాయి, బంకర్-బస్టింగ్ పద్ధతులను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో జరిపిన దాడిలో పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. మే 7న ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి భారత వైమానిక దళం, భారత నేవీ ఇజ్రాయెల్ లాయిటరింగ్ మందుగుండు సామగ్రిని ఉపయోగించాయి.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!