India-Pakistan: సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ భారత్‌కు ఇప్పటి వరకు 4 లేఖలను రాసింది. ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా.. మిగతా 3 లేఖలను ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసిందని పలు జాతీయ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ సందర్భంగా భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకిస్తాన్ జలవనరుల శాఖ నుంచి ఈ లేఖలు వచ్చినట్లు సమాచారం.
Read Also: ‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్!
అయితే, సింధూ జలాల ఒప్పందం నిలిపి వేస్తే పాకిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుందని ఓ లేఖలో పాక్ పేర్కొన్నట్లు గతంలో మీడియా కథనాలు ప్రచురించింది. ఈ అంశంపై చర్చించేందుకు పాక్ రెడీగా ఉందని టాక్. కాగా, ప్రోటోకాల్ ప్రకారం ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం. ఇక, రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించవని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే భారత ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే అని వెల్లడించారు.
Read Also: Karnataka High Court: కర్ణాటక హైకోర్టులో కేఎస్‌సీఏకు బిగ్ రిలీఫ్.. చర్యలు తీసుకోవద్దని వెల్లడి
ఇక, ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. దీంతో భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. కాగా, సింధూ, దాని ఉప నదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై నాటి భారత ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు.
Read Also: JanaSena: పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..!
కాగా, 1960లో పాక్- భారత్ ఒప్పందంతో సింధూ ఉప నదుల్లో తూర్పున ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు దక్కాయి. సింధూ నదితో పాటు దాని పశ్చిమ ఉప నదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు లభించాయి. పహల్గామ్ ఉగ్ర దాడి త్వాత పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.