PM Modi: ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాశ్మీర్ అభివృద్ధిని ఆపలేరు..
- చినాబ్ వంతెన ప్రారంభోత్సవం కాశ్మీర్ పురోగతికి ప్రతిబింబం..
- ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కాశ్మీర్‌లో అభివృద్ధిని ఆపలేరు..
- ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాం: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తొలిసారి కాశ్మీర్ లోయలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చినాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూ కాశ్మీర్ పురోగతికి ప్రతిబింబమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కాశ్మీర్‌లో అభివృద్ధిని ఆపలేరని పేర్కొన్నారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పేర్కొన్నారు. పాకిస్తాన్ పర్యాటకానికి, మానవత్వానికి వ్యతిరేకం.. మన టూరిజాన్ని దెబ్బ తీసి పేదల పొట్ట గొట్టాలని ప్రయత్నిస్తుంది.. ఆదిల్ హుస్సేన్ గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీ వాలా.. తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడేవాడు.. ఆ రోజు టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడాడు.. కానీ, చివరకు అతడ్ని కూడా ఉగ్రవాదులు చంపేశారని ప్రధాని మోడీ మండిపడ్డారు.
Read Also: YS Jagan: “అధైర్య పడొద్దు”.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన జగన్…
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇక, ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కాశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు.. అమాయక ప్రజలను చంపడంతోనే.. ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌తో మన శక్తి ఏంటో పాకిస్తాన్ కు చూపించామని వెల్లడించారు. సరిగ్గా నెల రోజుల క్రితం పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం.. పురుడు దేశం నాయకత్వానికి నిద్ర లేకుండా చేశామని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేదని నరేంద్ర మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!