Ponywallahs Revenue: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి అక్కడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ దాడి తర్వాత పహల్గామ్ కు రావానికి పర్యాటకులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి వచ్చే టూర్లను సుమారు 90 శాతం క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో స్థానికులకు ఆదాయ మార్గాలు ఒక్కసారిగా తగ్గిపోయింది. ముఖ్యంగా టూరిస్టులపై ఆధారపడే పర్యాటకులతో గుర్రపు స్వారీ చేయించేవారు (పోనీవాలాలు) తీవ్రంగా నష్టపోతున్నారు. పహల్గాంకు జీవనాధారంగా ఉన్న ఈ రంగం ఇప్పుడు తీవ్ర నష్టాల్లో కొనసాగుతుంది.
Read Also: Donlad Trump: ఏంటి ట్రంప్ మావా.. అప్పుడు బైడెన్ను ట్రోల్ చేశావ్.. మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలి..!
అయితే, పహల్గామ్ ప్రాంతంలో సుమారు ఆరు వేలకు పైగా గుర్రాలు పర్యాటక సేవలకు రెడీగా ఉండగా, ప్రస్తుతం వాటిలో కేవలం 100 గుర్రాలకే పని లభిస్తుంది. దీని వల్ల రోజుకు సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మిగిలిస్తుంది. ఒక్కో గుర్రాన్ని సుమారు లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన యజమానులు, వాటికి ఇప్పుడు పని లేకపోవడంతో పాటు రోజూ రూ.400 విలువైన ఆహారం గుర్రాలకు పెట్టాల్సింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గతంలో ఒక్క గుర్రం రోజుకు సగటున రూ.3,000 వరకు ఆదాయం తీసుకొచ్చేది. కానీ, ప్రస్తుతం పర్యాటకుల రాక తగ్గడంతో గుర్రాల యజమానులతో పాటు అక్కడ పని చేసే పని వారి పరిస్థితి కూడా దయనీయంగా మారిపోతుంది. ఉపాధి కోల్పోయి.. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందడం లేదంటూ పోనీవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టూరిజం రంగం పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.