Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర విభేదాలకు కారణమవుతోంది. శశిథరూర్ తీరుపై హస్తం పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా,
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
Air Chief AP Singh: ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం సత్తా చాటింది. ముఖ్యంగా, అత్యంత ఖచ్చితత్వంతో మిస్సైల్ అటాక్స్ చేసింది. అయితే, తాజాగా వైమానిక దళ అధిపతి అమర్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ఆలస్యంపై తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.”చాలాసార్లు, ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థలు ఎప్పటికీ రావని మాకు తెలుసు. కాలపరిమితి ఒక పెద్ద సమస్య.…
పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్య గురించి చర్చతో పాటు, ఈ ఆపరేషన్ లోగో రూపకల్పన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ లోగో ఎవరు రూపొందించి ఉంటారబ్బా అని సెర్చ్ చేయడం ప్రారంభించారు. Also Read:Bhatti Vikramarka: స్వామి ఆశీస్సులతోనే…
Turkey: టర్కీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయులు ఆ దేశంపై మండిపడుతున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కిష్ డ్రోన్లతో పాటు వాటిని ఆపరేట్ చేయడాని ఆ దేశ సిబ్బందిని కూడా నియమించింది. భారత్ జరిపిన దాడుల్లో డ్రోన్లతో పాటు, వాటిని ఆపరేట్ చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా హతమయ్యారు. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకు వెళ్లారు.
IPL 2025 Final: ఐపీఎల్ 2025 తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి తుది పోరు మరింత ప్రత్యేకంగా కనిపించబోతుంది. ఇందుకోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ను విజయవంతం చేసిన మన భద్రతా దళాలను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సత్కరించాలని ప్లాన్ చేసింది.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. మే 7న జరిగిన ఈ దాడులకు సంబంధించి కొత్త ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ దాడులను ‘‘ఆపరేషన్స్ రూమ్’’ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులు పర్యవేక్షిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే రోటీ తినండి.. లేకుంటే బుల్లెట్ ఉందని పాకిస్థాన్‌ను ప్రధాని మోడీ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సోమవారం గుజరాత్లో పర్యటించారు.