పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ దౌత్య ప్రచారంలో, వాషింగ్టన్ డిసిలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, వాషింగ్టన్ పోస్ట్‌లో పనిచేస్తున్న తన కుమారుడు ఇషాన్ థరూర్ ప్రశ్నలు అడిగాడు. వాషింగ్టన్ పోస్ట్ గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్ ఇషాన్ థరూర్ ఒక ప్రశ్న అడగడానికి లేచి నిలబడగా, థరూర్ నవ్వుతూ, “దీన్ని అనుమతించకూడదు. ఇతను నా కొడుకు” అని అన్నాడు.
Also Read:French Open 2025: లేడీ నాదల్ ఔట్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా!
అప్పుడు ఇషాన్, తొలి దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని నిరూపించే రుజువులు ఉన్నాయా అని ఏదైనా విదేశీ ప్రభుత్వం మిమ్మల్ని అడిగిందా అని ప్రశ్నించాడు. పాకిస్తాన్ తిరస్కరణ గురించి మీరు ఏమి చెబుతారని అడిగాడు. శశి థరూర్ సమాధానమిస్తూ.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా గట్టి ఆధారాలు లేకుండా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించేది కాదని అన్నారు. మమ్మల్ని ఎవరూ రుజువు అడగలేదని శశి థరూర్ అన్నారు. కానీ మీడియా రుజువు అడిగిందని తెలిపారు.
భారత్ గట్టి రుజువు లేకుండా సైనిక కార్యకలాపాలు నిర్వహించగల దేశం కాదు. పాకిస్తాన్ భారతదేశంపై 37 ఉగ్రవాద దాడులు చేసింది. ప్రతిసారీ దాని ప్రమేయాన్ని ఖండించింది. లాడెన్ తన దేశంలో లేడని కూడా పాక్ ఖండించింది, కానీ అతను అక్కడే దొరికాడు అని అన్నాడు. పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని అంతర్జాతీయ సమాజానికి కూడా తెలుసని ఆయన అన్నారు.