Trump: అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా.. మరోసారి భారత్-పాక్ వార్‌పై ట్రంప్ వ్యాఖ్య
- భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా
- అయినా కూడా నోబెల్ శాంతి బహుమతి రాలేదన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతున్నట్లుగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు చెప్పారని.. వెంటనే ఇరు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో యుద్ధం ఆపినట్లుగా ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: JD Vance: గుడ్‌న్యూస్ చెప్పిన జేడీ వాన్స్ దంపతులు
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
2025 ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా 2025 మే 10న భారతదేశం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
ఇది కూడా చదవండి: IMD Warning: పలు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
అయితే రెండు దేశాలను వాణిజ్య సుంకాలతో హెచ్చరించడంతో యుద్ధం ఆపాయని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వాగతించగా.. భారత్ ఖండించింది. మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది.
తాజాగా మంగళవారం వైట్ హౌస్‌లో ట్రంప్ ప్రసంగిస్తూ.. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని.. రెండు దేశాలు అణ్వాయుధానికి సిద్ధపడుతుండగా నిరోధించినట్లు చెప్పారు. ‘‘నేను 10 నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపాను… పాకిస్థాన్-భారతదేశం అణ్వాయుధం వైపు పయనించాయి. ఎనిమిది విమానాలను కాల్చివేశారు. నా అభిప్రాయం ప్రకారం అవి అణ్వాయుధాలను ఉపయోగించబోతున్నాయి. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇక్కడ ఉన్నారు. అధ్యక్షుడు ట్రంప్ 10 మిలియన్ల మందిని రక్షించారని.. బహుశా అంతకంటే ఎక్కువేనని ఆయన అన్నారు.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇక నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై నిరాశను వ్యక్తం చేశారు. 10 నెలల్లో ఎనిమిది యుద్ధాలు ఆపినా కూడా నోబెల్ శాంతి బహుమతి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ఆపినందుకు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ తనకు కృతజ్ఞత కూడా చెప్పారని గుర్తుచేశారు. అయితే నోబెల్ బహుమతితో తమకు సంబంధం లేదని నార్వే ప్రభుత్వం స్పష్టం చేసింది. అది నోబెల్ కమిటీకి సంబంధించిన విషయమని తేల్చి చెప్పింది. అయినా కూడా తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.
#WATCH | US President Donald Trump says, "…I ended eight unendable wars in 10 months…Pakistan and India. They were really going at it. Eight planes were shot down. They were going to go nuclear, in my opinion. The Prime Minister of Pakistan was here and he said, President… pic.twitter.com/kTDa912iLQ
— ANI (@ANI) January 20, 2026
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!