Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఈసారి రాష్ట్రంలో ఉనికి చాటుకోకుంటే… ఇక దుకాణం కట్టేసుకోవాల్సిందేనన్నంత కసి, భయం కలగలిసి ఉన్నాయట ఆ పార్టీ నేతల్లో. రాష్ట్ర నాయకుల సంగతి పక్కన పెడితే… అధిష్టానమే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. అంతర్గత కుమ్ములాటలతో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదలగా వ్యూహ రచన జరుగుతోందట. పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి అవకాశాన్ని…