Off The Record: ఆ నియోజకవర్గంలో ఈటల వ్యూహం ఏంటి..? ఆ నేతకు చెక్ పెడతారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పరకాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఈసారి ఇక్కడ పార్టీని గెలిపించి తన పంతం నెగ్గించుకోవాలని కసిగా ఉన్నారాయన. బీఆర్ఎస్ సిట్టింగ్ చల్లా ధర్మారెడ్డికి చెక్ పెట్టేందుకు కొత్త అభ్యర్థిని బరిలో దింపడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయినట్టు తెలిసింది. స్థానికంగా పేరున్న డాక్టర్ కాళిప్రసాద్ బీజేపీకి దగ్గరయ్యారు. స్థానికుడైన కాళీప్రసాద్ వైద్యవృత్తితో నియోజకవర్గ ప్రజలకు చిర పరిచితుడే. పైగా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇది పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట ఈటల. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈటల ఓటమికోసం విశ్వప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉంది.
ఈసారి దీటైన అభ్యర్థిగా కాళీ ప్రసాద్‌ను రంగంలోకి దింపి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారట ఈటల. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సైతం కాళీప్రసాద్ రాకను స్వాగతిస్తున్నారు. తన ఇమేజికి తోడు పరకాల పట్టణంలో బీజేపీకి మంచి పట్టు ఉండడంతోపాటు, బడుగు బలహీనవర్గాల ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారట కాళీ ప్రసాద్. మున్నూరు కాపు అయిన డాక్టర్‌కు కొండా సురేఖ-మురళీ దంపతుల సహకారం సైతం అందుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా దంపతులకు రాజకీయ ప్రత్యర్థి అయిన చల్లాను ఓడించేందుకు డాక్టర్‌కు వాళ్ళ సహకారం ఉంటుందన్నది స్థానిక అంచనా. పరకాల నియోజకవర్గంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, సంగెం, దామెర మండలాలు ఉండగా … మొత్తం ఓటర్లు 2లక్షల 11వేల 660 మంది. అందులో ప్రధానంగా బీసీ సామాజికవర్గాలకు చెందిన ఓట్లు సుమారు 60శాతం ఉన్నాయి. ముదిరాజ్‌ల ఓట్లు 31వేలు, మున్నూరు కాపుల ఓట్లు 32వేలు, గౌడ్స్ 25వేలు, యాదవులకు 22వేలు, పద్మశాలీలకు 15వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది.
Also Read
- Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
- World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
- JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
ఈటల రాజేందర్ మాటకు ముదిరాజ్ సామాజికవర్గం కట్టుబడి ఉంటుందని, అదే సమయంలో సొంత సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్న నమ్మకంతో డాక్టర్ కాళీప్రసాద్ ఉన్నారు. మొత్తం మీద అధికారికంగా ప్రకటించకున్నా… పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కాళీ ప్రసాద్ ఫిక్స్ అన్నది పార్టీ కేడర్ మాట. సామాజికవర్గాల సమీకరణలతో ఈసారి పోరు కూడా రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
-
Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!