Off The Record: క్షేత్ర స్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా ఊపిరి పోసేవి స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎలక్షన్స్‌లో అయితే… పార్టీ సింబల్స్ ఉండకపోవచ్చుగానీ… వాళ్ళు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇక్కడే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార పార్టీగా నిన్నటి మొదటి విడత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచినా… కొన్ని తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా రావాల్సిన సీట్లు తగ్గాయంటున్నారు. వర్గపోరు, సొంతోళ్ళే దెబ్బ కొట్టడం…
Off The Record: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త పంథా ఎంచుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సాధారణంగా ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే ఆ లోతుల్లోకి వెళ్ళి తవ్వకాలు జరిపి అవశేషాలను కూడా వెలికి తీస్తుంటారు. అవతలోళ్ళని గిల్లి గిచ్చి… ఓరి బాబోయ్…. వద్దు. నీకో దండం అనేలా చేస్తుంటారన్నది విస్తృతాభిప్రాయం. ఆ క్రమంలోనే ఇప్పుడు తన ఫోకస్ బీజేపీ మీదికి షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. వ్యక్తిగా ఉండవల్లి బీజేపీ,…
Off The Record: కేబినెట్ సహచరుల్ని ఈ మధ్య కాలంలో తరచూ హెచ్చరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పని చేయండి, పరుగులు పెట్టండి అంటూ తరుముతున్నారు. ప్రతిపక్షం విమర్శలకు గట్టి కౌంటర్స్ వేయమని కూడా సూచిస్తున్నారు. కానీ…ఎక్కువ మంది మంత్రులు వీటిలో ఏ ఒక్క పనీ సమర్ధంగా చేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోందట టీడీపీ వర్గాల్లో. నేను 95 సీఎం అవుతా… నా స్పీడ్ మీరు అందుకోవాలని కూడా పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. 95లో ఉన్నట్టుగా…
Off The Record: పార్టీ ప్రతినిధులు కాదు. ప్రజా ప్రతినిధులు అంతకంటే కాదు. ఎవరూ ఎవర్నీ ప్రోత్సహించినట్టు కనిపించలేదు. కానీ…. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది సోషల్ మీడియాలో, బయటా తెగ చెలరేగిపోయారు. కనీసం వైసీపీ ప్రాధమిక సభ్యత్వం లేని వాళ్ళు కూడా పార్టీకి తామే బ్రాండ్ అంబాసిడర్స్ అన్నట్టు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. జగన్ అభిమానులం, వైసీపీ సానుభూతిపరులం అన్న ట్యాగ్ లైన్స్‌తో… అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా……
Off The Record: గాల్లో ఎగరాల్సిన ఇండిగో విమానం…ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయి…చివరకు ఏపీ మంత్రి లోకేష్ గాలి తీసేసే వరకు వచ్చిందా అంటే… ఎస్ అన్నదే ఈ పరిణామాలను గమనిస్తున్నవారి సమాధానం. తన ప్రమేయం లేకుండానే ఈ ఎపిసోడ్‌లోకి లాగి… అనవసరంగా ట్రోల్ చేయిస్తున్న పార్టీ నాయకుల్ని చూసి చివరికి లోకేష్ కూడా…. అరె ఎవుర్రా మీరంతా… అన్న సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటున్నారట. టీడీపీ అభిమానులు కూడా… ఎక్కడ తయారయ్యార్రా వీళ్ళంతా….. అనవసరమైన ఇష్యూలోకి ఆయన్ని లాగి…
Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, ఉదయగిరి. అలాంటి చోట్ల కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జెండా ఎగరేశారు. ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబాయ్, అబ్బాయ్ నియోజకవర్గాలకు ముఖం చాటేసి పార్ట్ టైం పొలిటీషియన్స్‌గా మారిపోయారంటూ…
బాగా నోరున్న మా పార్టీ నేతల్లో అంబటి రాంబాబు తొలి వరుసలో ఉంటారని చమత్కరిస్తుంటారు వైసీపీ నాయకులు. అందుకు తగ్గట్టే బయట కూడా ఆయనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయినా.. తర్వాత అందరికంటే ముందు సర్కార్ మీద వాయిస్ రెయిజ్ చేశారు అంబటి.
Off The Record: వల్లభనేని వంశీ…. ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గన్నవరం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. అదే పార్టీ తరపున ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీ బీ ఫామ్ మీద బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అయితే… 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీకి జై కొట్టారు వంశీ. ఆ క్రమంలోనే… 2019 నుంచి 2024 మధ్య…
పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. గాలివాటంలో గెలిచిన ఎమ్మెల్యే తీరు ఇలా కాకుంటే ఇంకెలా ఉంటుందిలే అంటూ... పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారట. వయసులో పెద్దవాడని, గతంలో ఆయనకు ఉన్న ట్రాక్
Off The Record: తగ్గేదేలే…. ఇక మాటల్లేవ్…. మాట్లాడుకోవడాల్లేవ్…. అన్నీ పోట్లాడుకోవడాలేనని అంటున్నారట బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ కుమార్తెగా గౌరవించి ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నామని, ఇక మాటకు మాట సమాధానం చెబుతామని అంటున్నారు. పార్టీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరుతో ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్న కవిత…. తాను వెళ్ళిన ప్రతిచోట స్థానిక బీఆర్ఎస్ నాయకులను, ప్రత్యేకించి మాజీ మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. అధికార…