తెలంగాణ కమ్యూనిస్ట్లు దింపుడుకల్లం ఆశల్లో ఉన్నారా? బీఆర్ఎస్ నాయకత్వం తమను పూచిక పుల్లల్లా చూస్తోందన్న ఆవేదనతో రగిలిపోతున్నారా? లెఫ్ట్ పార్టీల తదుపరి అడుగులు ఎటు పడబోతున్నాయి? ఎవరో ఒకరితో అంటకాగక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ పార్టీవైపు చూస్తున్నారు? తెలంగాణ కమ్యూనిస్టులు పొలిటికల్ క్రాస్రోడ్స్లో ఉన్నారు. ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోవడం ఒక సమస్య అయితే… ఎటు వెళ్తే ఏమవుతుందోనన్న భయం కూడా వాళ్ళని వెంటాడుతోందట. మునుగోడు ఉప ఎన్నిక వరకు కారు వెనకే పరుగులు పెట్టారు కమ్యూనిస్టులు.…
తెలంగాణ పొలిటికల్ స్క్రీన్పై కొత్త చిత్రాలు కనిపించబోతున్నాయా? పతంగి పార్టీ కేంద్రంగా పరిణామాలు మారుతున్నాయా? పాతబస్తీ దాటి ఆ పార్టీ బయటికి వస్తే…నష్టం ఎవరికి? ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీలిస్తే…దెబ్బ పడేది ఎవరికి? అసలు మజ్లిస్ అధినేత మనసులో ఏముంది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేది ఎంఐఎం. తెలంగాణ ఏర్పాటయ్యాక మిత్రులు మారిపోయి బీఆర్ఎస్తో దోస్తీ కుదిరింది. ఇన్నాళ్ళు ఆ మైత్రి కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇప్పుడు అసెంబ్లీ…