Abrar Ahmed: పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన ‘సన్‌రైజర్స్’ ఓనర్ కావ్యా.. SRH ఫ్యాన్స్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abrar Ahmed: భారత్‌కు పాకిస్థాన్‌కు మధ్య చాలా కాలం నుంచి సంబంధాలు సరిగ్గా లేవు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను అన్ని రంగాల్లో దూరం పెట్టాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ పాకిస్థాన్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడం పెద్ద వివాదంగా మారింది. నిన్న(గురువారం) లండన్‌లోని హండ్రెడ్ లీగ్-2026 వేలంలో కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇటీవలే హండ్రెడ్ లీగ్‌లోని సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ది హండ్రెడ్ (The Hundred) క్రికెట్ లీగ్ ఏటా లండన్‌లోని వేల్స్‌లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) నిర్వహిస్తుంది. ఇది సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతుంది. ఈ లీగ్ ఇంగ్లాండ్‌లోని వివిధ నగరాల్లోని స్టేడియాలలో నిర్వహిస్తారు.
READ MORE: Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ఈ క్రమంలో జరిగిన వేలంలో కావ్యా మారన్ పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ ప్లేయర్, స్పిన్నర్ అహ్మద్‌ను 1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు అంటే రూ. 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. టెంట్ రాకెట్స్‌తో పోటీ పడీ మరీ ఈ ఓవర్ అబ్రార్ అహ్మద్‌ను దక్కించుకుంది. ఈ ఒక్క నిర్ణయంతో అప్పటి వరకు ఎంతో మంచి మదిని దోచుకున్న కావ్యా ఒక్కసారిగా విలన్‌లా మారిపోయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ మిన్నంటాయి. ఇక ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక అబ్రర్ అహ్మద్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. పాకిస్థాన్ జట్టులోని ఓవర్ యాక్షన్ ప్లేయర్లలో ఇతడు ఒకడు. ముఖ్యంగా భారత్‌తో జరిగే మ్యాచుల్లో ఈ ప్లేయర్ ఓవర్ యాక్షన్ పెరుగుతుంది. ఇటీవల జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ ఇది కనిపించింది. ఇలాంటి వ్యక్తిని జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతే కాదు.. అహ్మద్‌కు ముందు మరో పాక్ ఆటగాడు హారీస్ రౌఫ్ వేలానికి వచ్చినప్పుడు కావ్యా రిజెక్ట్ చేసింది. అప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. కట్ చేస్తే అహ్మద్‌ను పోటీ పడీ మరి కొనడంపై ట్రోల్స్ షురూ అయ్యాయి. ఇదే వేలంలో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.
READ MORE: Supreme Court: టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కశ్మీర్ వేర్పాటువాదికి బెయిల్!
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!