Off The Record: మైనంపల్లి దారెటు..? కొడుకు సీటు కోసం పార్టీ మారతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో మరోసారి పాగా వేసి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్ ఈసారి అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేయలేదు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో.. రిస్క్ ఎందుకనుకుంటూ.. మెజార్టీ సిట్టింగ్‌లకే సీట్లిచ్చేసింది. ఒకేసారి 115 మందితో జాబితా విడుదల చేసిన కేసీఆర్.. ఏడుగురు సిట్టింగ్‌లను మాత్రమే మార్చారు. ఇక పొలిటికల్ వారసుల సంగతిని పట్టించుకోలేదు. ఈసారి తమ వారసులను బరిలో దింపి అసెంబ్లీలో తమతో పాటు కూర్చోబెట్టుకుందామనుకున్న సిట్టింగ్‌లకు నిరాశే మిగిలింది. పరిస్థితిని గమనించి ఈ విషయంలో కొందరు సర్దుకుపోతే.. ఒకరిద్దరు నేతలు మాత్రం గుర్రుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనoపల్లి హన్మంతరావు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఆశించారు. లిస్ట్‌లో అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి పేరు ఉండటంతో గరం గరంగా ఉన్నారు మైనంపల్లి. అదే సమయంలో పార్టీ ముఖ్య నేత హరీష్‌రావు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఆయన పార్టీలో ఉంటారా? లేక వేరేదారి చూసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.
గతంలో టీడీపీలో ఉన్న మైనంపల్లి బీఆర్‌ఎస్‌లో చేరాక మొదట్లో ఎమ్మెల్సీ ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు కేసీఅర్. అయితే.. ముందు నుంచి ఆయన తీరు ఇబ్బందికరంగానే ఉందంటున్నాయి గులాబీ వర్గాలు. పార్టీ పరంగా ఎటువంటి సంకేతాలు లేకుండానే ఎమ్మెల్యే తన కుమారుడిని మెదక్ బరిలో దింపాలనుకున్నారని, అది సమంజసమా అని ప్రశ్నిస్తున్నాయి. తీరా తాను అనుకున్నది జరక్కపోవడంతో మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేయడం ఏంటని తప్పు పడుతున్నారు కొందరు నేతలు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావు ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠతోపాటు ఆయన విషయంలో పార్టీ అధినాయకత్వంపు వైఖరి ఎలా ఉంటుందన్న చర్చ సైతం జోరుగా జరుగుతోంది. లిస్ట్‌లో ఆయనకు మల్కాజ్‌గిరి టిక్కెట్ ప్రకటించేశారు కేసీఆర్. ఇక ఎంత గింజుకున్నా… అంతకు మించి మార్పు ఉండే ఛాన్స్ లేకపోవడంతో ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న అంతర్గత సమాచారం ప్రకారం హన్మంతరావుపై చర్యలకే గులాబీ పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అయితే.. తొందర పడకుండా.. సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు. మరి ఎమ్మెల్యే అప్పటిదాకా వేచి చూస్తారా? లేక ఈలోపే తన నిర్ణయం తాను తీసుకుంటారా అన్నది చూడాలి.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?