టి దీపోత్సవం వేళ హైదరాబాద్ మహా నగరం సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే తొమ్మిది రోజులు విజయవంతంగా ముగిశాయి. కోటి దీపాల పండుగ.. కోటి దీపోత్సవం నేటితో పదో రోజు ఘనంగా ప్రారంభమైంది.
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'కోటి దీపోత్సవం' తొమ్మిదో రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
స్టేషన్లోనే సెటిల్మెంట్: శ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు మాఫీ కోసం పోలీసులు వాటాలు పంచుకున్నారు. వివరాల ప్రకారం… తణుకు మండలం వేల్పూర్‌లో ఆకుల మారుతి రావుకు గేదెల ఫామ్ ఉంది. ఇటీవల ఫామ్‌లో రెండు గేదెలను ఇద్దరు వ్యక్తులు దొంగలించారు. ఈ విషయం గురించి తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో మారుతి రావు ఫిర్యాదు చేశారు. గేదెలను దొంగిలించిన ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కేసు మాఫీకి 12 లక్షల రూపాయలకు దొంగలతో…
నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. తల్లిదండ్రులు అమ్మనమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి: క్యాపిటల్ జోన్ ప్రాపర్టీ షో బ్రోచర్…
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే ఎనమిది రోజులు విజయవంతంగా ముగిసాయి. ఎనమిది రోజుల్లో విశేష…
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు, రేపు జరిగే గ్రూప్-3 పరీక్షల కోసం సెంటర్ల వద్ద కఠిన చర్యలను చేపట్టింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచన చేసింది. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడీ(పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్)లను చూపించాల్సి ఉంటుంది. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా…
భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. నేడు ఏడో రోజు వైభవోపేతంగా జరగుతున్న కోటి దీపోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. ఇల కైలాసంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు ప్రతిరోజు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోటి దీపోత్సవంలోని కార్యక్రమాలను వీక్షించి.. లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంలో ఇప్పటికే ఆరు రోజులు…
ప్రతి ఏడాది మాదిరిగానే ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం భక్తి టీవీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. ఇల కైలాసంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోటి దీపోత్సవంలోని కార్యక్రమాలను వీక్షించి.. లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంలో…