పార్టీ ఆవిర్భావం తర్వాత బోణీ కొట్టిన నియోజకవర్గంలో గ్లాస్ ఇంకా బ్యాలెన్స్ అవడం లేదా? నాయకుడు మారినా నడిపే తీరు మాత్రం మారడం లేదా? దశాబ్దానికి పైగా పార్టీ జెండా మోసిన వాళ్ళు అందుకే హర్ట్ అవుతున్నారా? రాజోలు జనసేన రచ్చకు అసలు కారణం ఏంటి? పవన్ వార్నింగ్ ఇచ్చాక కూడా పరిస్థితులు మారే అవకాశం లేదా? లెట్స్ వాచ్. పార్టీ పెట్టాక తొలిసారి 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు రాజోలులో గెలిచింది జనసేన.…
మరావతి వ్యవహారాల్లో మున్సిపల్ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? అన్ని వ్యవహారాలను డీల్ చేయడం ఆయనవల్ల కావడం లేదా? అందుకే కేంద్ర మంత్రి తెర మీదికి వచ్చారా? ఆ విషయమై జరుగుతున్న చర్చలేంటి? మున్సిపల్ మినిస్టర్‌కు ఎక్కడ తేడా కొట్టింది? అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ వేసింది ఏపీ సర్కార్. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. సమస్య పరిష్కారం సంగతి…
కలెక్టర్ అంటే జిల్లాకు సుప్రీమ్. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ…. ఏ చిన్నా తేడా వచ్చినా హడలెత్తించిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ఆ జిల్లా పేరు చెబితేనే హడలి పోతున్నారట. కావాలంటే పనిష్మెంట్ కింద లూప్లైన్లో వేయండిగానీ… ఆ జిల్లాకు మాత్రం కలెక్టర్‌గా వద్దని అంటున్నారట. ఐఎఎస్‌లనే అల్లల్లాడిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బ్యూరోక్రాట్స్‌లో హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలోనే అతి చిన్నదైన…
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ఇప్పటికే రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ జాజికాయ జాజికాయ భారీ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 5న అఖండ 2 వరల్డ్ వైడ్…
ఆ ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి కేవలం ఉత్సవ విగ్రహంలా మారిపోయారా? అసలు అలాంటి వ్యక్తి ఒకరున్నారన్న సంగతిని అదే జిల్లాకు చెందిన సీనియర్ మినిస్టర్స్‌తో పాటు ఉన్నతాధికారులు సైతం మర్చిపోయారా? ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారింది? ఏయే సమీకరణలు తేడా కొడుతున్నాయి? కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు కేరాఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా. మామూలుగా పార్టీలో వ్యవహారాలే తేడాగా ఉంటాయని అనుకుంటే… అందులోనూ… నల్లగొండ మేటర్స్ ఇంకాస్త తేడాగా ఉంటాయంటూ…
పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో క్యాస్ట్ ఫీలింగ్ బాగా పెరిగిపోయిందా? లోకల్‌గా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలన్నిటినీ పర్యవేక్షించే వాళ్ళంతా సొంత సామాజికవర్గానికి చెందిన వాళ్ళేనా? ఆ విషయంలో పిఠాపురానికి చెందిన మిగతా సామాజికవర్గాల మనోభావాలు ఎలా ఉన్నాయి? సొంత పార్టీవాళ్ళే తప్పుపట్టే పరిస్థితి వచ్చిందా? అక్కడేం జరుగుతోందో అసలు పవన్‌కు తెలుస్తోందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ప్రత్యేకించి…
ఆ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో కాంగ్రెస్ పెద్దలు ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోయారు? పైగా కత్తి మీద సాములా మారిందని ఎందుకు ఫీలవుతున్నారు? జిల్లాకు చెందిన మంత్రి, సీనియర్ లీడర్ ఒక మాట మీదికి వచ్చి ఓకే అన్నా… వాళ్ళు చెప్పిన వ్యక్తికి ఎందుకు పదవి దక్కలేదు? కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ప్రభావం పడిందా? మంత్రి మాట సైతం నడవనంతగా ఏం జరిగింది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? తెలంగాణలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవుల్ని…
కార్పొరేషన్ ఛైర్మన్స్‌గా ఇన్నాళ్ళు కూల్ కూల్‌గా పొజిషన్ ఎంజాయ్ చేసిన ఆ నేతలకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుందట. అదనంగా దక్కిన పోస్ట్ వాళ్ళని కంగారు పెడుతోందట. ఉన్నదానికి అదనంగా మరో పదవి దక్కితే ఇంకా హ్యాపీగా ఫీలవ్వాల్సిన నాయకులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎవరా నాయకులు? ఎందుకా కంగారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడో కొత్త టెన్షన్లో ఉన్నారు. అనూహ్యంగా ఓ పదవి వచ్చిందిగానీ… దాని దెబ్బకు ఉన్న పోస్ట్ ఊడుతుందా ఉంటుందా? అంటూ చాలామంది…
సిట్టింగ్ ఎమ్మెల్యేకి, మాజీ మంత్రికి మధ్య పంచాయితీని కాంగ్రెస్ అధిష్టానం తేల్చలేకపోతోందా? ఎంత నానిస్తే అంత బాగా తెగుతుందనుకుంటూ… మొదటికే మోసం తెచ్చుకుంటోందా? వాళ్ళిద్దరి మధ్య లొల్లిలో మంత్రులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఎవరా ఇద్దరు? వాళ్ళిద్దరి వివాదం ఎందుకు కొలిక్కి రావడం లేదు? కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే….. కాస్త అనేకంటే….. మరి కాస్త అనుకోవడమే కరెక్ట్. అదే పార్టీకి బలహీనతగా మారుతున్నా… సరిదిద్దలేని పరిస్థితి. రాజకీయ పార్టీలన్నాక ఎక్కడైనా నాయకుల…
ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారుల్ని ఇప్పుడో టీడీపీ ప్రజాప్రతినిధి తీవ్ర స్ధాయిలో బెదిరిస్తున్నారా? నెలనెలా నాకు కప్పం కట్టకుండా వ్యాపారాలు ఎలా చేసుకుంటారో చూస్తానంటూ వార్నింగ్స్ ఇస్తున్నారా? మాట వినని వాళ్ళ మీదికి పోలీస్, మైనింగ్ ఆఫీసర్స్‌ని ఉసిగొల్పుతున్నారా? మీ పాటికి మీరు యాపారాలు చేసేసుకుంటే.. నాకేంటి అంటున్న ఆ నాయకుడు ఎవరు? ఆ కప్పాల కహానీ ఏంటి? ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారం ఇప్పుడు తీవ్ర గడ్డు…