శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలని అంటారు. ఓ పక్క రాష్ట్రంలో జడలు విప్పిన రేషన్ మాఫియాను కట్టడి చేయడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తుంటే… తెలివి మీరిన ముఠాలు కొత్త దారులు వెదుకుతున్నాయట. మాలెక్క తేలిస్తే… మీ లెక్కలు సెటిల్ చేస్తామంటూ… సరికొత్త బేరగాళ్ళు మార్కెట్లో తిరుగుతున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఏకంగా మాఫియాకే ఆఫర్స్ ఇస్తున్న ఆ ముఠాలేంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా వేళ్ళూనుకుని పోయింది. ఇది ఎవరో దారిన పోయే దానయ్య…
విచారణ ముమ్మరం చేసిన సిట్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగుతోంది. భూదేవి కాంప్లెక్స్‌లో లడ్డు కల్తీ వ్యవహారంపై సీబీఐ సిట్ బృందం సమావేశమంది. డీఎస్పీ, సీఐలు సహా ఇతర అధికారులు సీబీఐ ఎస్పీ మురళి రాంబాతో సమావేశం కానున్నారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభించింది. అధికారులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సిట్ అధికారులు తిరుమలలో రెండు…
కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం ఏ. సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఏలూరు కాల్వలోకి స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఆదివారం కావడంతో సరదాగా కాలువలోకి స్నానానికి వెళ్లారు చిన్నారులు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు ఏ.సీతారాంపురం గ్రామానికి చెందిన రెడ్డి అజయ్, పోల యశ్వంత్ కృష్ణగా గుర్తించారు.…
అతి సర్వత్రా… అన్నది ఆ ఎమ్మెల్సీ విషయంలో ప్రాక్టికల్‌గా నిరూపితం అవుతోందా? ఓ పద్ధతి ప్రకారం ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధం అవుతోందా? తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పవర్ పోయాక మరో రూపంలో దూకుడు ప్రదర్శించి జనం నోళ్ళలో విపరీతంగా నానుతున్న ఆ లీడర్‌కు ఇప్పుడు సొంత పార్టీవాళ్ళే సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? ఎవరా ఎమ్మెల్సీ? ఏంటాయన జిల్ జిల్ కీ కహానీ? సిక్కోలు పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ది డిఫరెంట్ స్టైల్.…
అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి డ్రైవర్ లేని కారులా మారిందట. కేడర్ ఇప్పటికీ బలంగా ఉంది. ఏ ఎన్నికైనా సై అంటోంది. కానీ… నడిపే నాయకుడు లేక దిక్కులు చూస్తోందట. సరైనోడు ఒక్కడు తగిలితే చాలు… మా సత్తా ఏంటో చూపిస్తామంటూ సైసై అంటున్నా అధిష్టానం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదట. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వ దిక్కులేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్లీజ్… ప్లీజ్.. మాకో లీడర్….. అంటోంది హుజూర్నగర్…
భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కాగా.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
"దీపం ఐక్యతకు చిహ్నం.. ఆ ఐక్యతే మనకు బలం.. మనలో ఆ ఐక్యత కొనసాగాలని ఆశిస్తూ.. అలాగే ఈ కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది.. ఇటువంటి దీపోత్సవాల ద్వారా ప్రతి ఇల్లు ఒక ఇల్లు దేవాలయం కావాలి.. జ్ఞానసంపదకు క్షేత్రం కావాలి" అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోటి దీపోత్సవానికి హాజరై ప్రసంగించారు.
భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 'కోటి దీపోత్సవం' కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కార్తిక సోమవారం శుభవేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.