Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
- ఇంట్లో సేకరించిన పాలమీగడతో..
- స్వచ్ఛమైన, రుచికరమైన నెయ్యిని సులభంగా తయారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Ghee: మార్కెట్లో లభించే నెయ్యితో పోలిస్తే ఇంట్లోనే స్వచ్ఛమైన పాలమీగడతో తయారు చేసుకునే నెయ్యి ఎంతో రుచిగా, సువాసనభరితంగా ఉంటుంది. అంతేకాదు.. నెయ్యి తయారీలో ఉపయోగించే పదార్థాలు మనకు తెలిసినవే కాబట్టి నాణ్యత విషయంలోనూ ఒక భరోసా ఉంటుంది. అయితే ఇంట్లో నెయ్యి తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని, చేతులకు వెన్న అంటుకుని ఇబ్బందిగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నెయ్యిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆ విధానం ఏంటో చూద్దామా..
కావలసిన పదార్థాలు:
* ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పాలమీగడ
* చల్లటి నీరు లేదా ఐస్ ముక్కలు
* అర టీస్పూన్ మెంతులు లేదా ఒక తమలపాకు
Also Read
- Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
తయారీ విధానం:
రోజూ పాలను కాచి చల్లార్చిన తర్వాత పైకి వచ్చే మీగడను తీసి ఒక శుభ్రమైన డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. కొన్ని రోజుల పాటు ఇలా సేకరించిన మీగడతో ఒకేసారి నెయ్యి తయారు చేసుకోవచ్చు. నెయ్యి తయారు చేసే ముందు మీగడను ఫ్రిజ్ నుంచి బయటకు తీసి కాసేపు ఉంచాలి. పూర్తిగా గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వెన్న వేరు చేయడం సులభంగా ఉంటుంది.
గది ఉష్ణోగ్రతకు వచ్చిన మీగడను మిక్సీ జార్లో లేదా వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. వాతావరణం వేడిగా ఉంటే చల్లటి నీటిని, చలికాలంలో అయితే సాధారణ నీటిని కొద్దిగా కలపాలి. మీగడను ఒకే దిశలో చిలకడం లేదా మిక్సీలో కొద్దిసేపు తిప్పడం చేయాలి. ఇలా చేస్తే కొద్దిసేపటికే వెన్న ముద్దలా పైకి తేలుతుంది. దీంతో చేతులతో ఎక్కువగా కలపాల్సిన అవసరం ఉండదు. వేరైన వెన్నను శుభ్రమైన నీటితో ఒకటికి రెండుసార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల వెన్నలో మిగిలి ఉండే మజ్జిగ తొలగిపోయి నెయ్యికి మంచి రుచి, వాసన వస్తాయి.
ఇప్పుడు శుభ్రంగా కడిగిన వెన్నను మందపాటి అడుగు ఉన్న పాత్రలో వేసి స్టవ్‌పై పెట్టాలి. మధ్యస్థ మంటపై వెన్నను నెమ్మదిగా కరిగించాలి. వెన్న పూర్తిగా కరిగిన తర్వాత నురుగు వస్తూ మరుగుతుంది. అడుగు పట్టకుండా అప్పుడప్పుడు గరిటెతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. వెన్నలోని నీటి శాతం తగ్గుతూ క్రమంగా నెయ్యి స్పష్టంగా మారుతుంది. నెయ్యి బంగారు రంగులోకి మారి మంచి సువాసన రావడం ప్రారంభమైనప్పుడు మంటను తగ్గించాలి. అనంతరం కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
నెయ్యి కొద్దిగా చల్లారిన తర్వాత, ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే స్టీల్ జల్లెడ లేదా పలుచని వడతో వడకట్టుకోవాలి. వాటితో వడకట్టి శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాజు సీసా లేదా స్టీల్ డబ్బాలోకి నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి పూర్తిగా చల్లారిన తర్వాత మంచి రంగుతో, చక్కటి సువాసనతో గట్టిపడుతుంది. వాడేటప్పుడు ఎల్లప్పుడూ పొడిగా ఉన్న స్పూన్‌ను మాత్రమే ఉపయోగించాలి.
నెయ్యి నిల్వ చేసే సీసా లేదా డబ్బాలో తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తడి స్పూన్లు లేదా తడి చేతులతో నెయ్యిని తీయకూడదు. పొడిగా, శుభ్రంగా ఉండే గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే నెయ్యి ఎక్కువకాలం నాణ్యతను కాపాడుకుంటుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!