What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- గుంటూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
- తిరుపతిలో మంత్రి నారా లోకేష్ పర్యటన
- నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం
- నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రం సీఎం ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరుకానున్నారు.
ఇవాళ గుంటూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరనున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్‌గా సీఎస్ ఆర్కే ప్రసాద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్కే ప్రసాద్ మూడేళ్ల పాటు వీసీగా కొనసాగనున్నారు.
నేడు మంత్రి నారా లోకేష్ తిరుపతిలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
అనంతపురం నగరంలోని కాశీవిశ్వేశ్వర కోదండరామాలయంలో నేటి నుంచి మహాశివరాత్రి ద్వాదశ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
వల్లభనేని వంశీ కేసులో పిటిషన్లు మీద నేడు ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరగనుంది. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్ల మీద నేడు ఇరు వర్గాలు కౌంటర్లు దాఖలు చేయనున్నాయి.
నేడు రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
శ్రీశైలంలో నేటి నుండి మార్చి 1 వరకు.. 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
నేడు వీరరాఘవరెడ్డి రెండోరోజు కస్టడీ విచారణ కొనసాగనుంది. మొదటిరోజు కస్టడీ విచారణలో మొయినాబాద్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవము
నేటి నుండి ప్రారంభం కానుంది.
నేడు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కి రానున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు.
నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30కు మ్యాచ్ ఆరంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్-18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!