నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో కొకకోలా ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ బండ తిమ్మాపూర్ చేరుకుంటారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఇద్దరు మంత్రులు పలు అభివృద్ధి పథకాలకు శంఖుస్థాపన చేయనున్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటించనుంది. జిల్లా జెడ్పి కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయాలు కమిషన్ స్వీకరించనుంది.…
దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు: టీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను.. తనకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి…
కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది: గత కొన్ని నెలలుగా కూరగాయలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.35-40గా కొనసాగుతోంది. మిగతా కూరగాయలు రూ.30-50గా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోవైపు కోడిగుడ్డు రేటూ రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్లో దాదాపుగా రూ.7గా పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో…
నేడు విజయనగరం, విశాఖ జిల్లాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించనున్నారు. ఈరోజు నెల్లూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. ఒంగోలులో మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు. పుదుచ్చేరి…
ఎవరైనా తప్పించుకోలేరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఐదేళ్లలో చాలా దారుణాలు చేశారన్నారని, ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి హోదాలో ఉన్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మంత్రి డోలా ఎద్దేవా చేశారు. సోదరుడి…
రాజ్యసభకు నాగబాబుకు: సినీ నటుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు.. రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అని సమాచారం. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన: దక్షిణ…
నేడు సీపీఎం నేత బృందా కారాట్ ఆదిలాబాద్ నగరంలో పర్యటించనున్నారు. సీఐటీయూ కార్యాలయ ప్రారంభంతో పాటు సభలో పాల్గొననున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. నేడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆర్జీవీ నాలుగు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. వర్మ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మహారాష్ట్ర సీఎం ఎవరన్నది బీజేపీ హైకమాండ్ నేడు తేల్చబోతోంది. ఏక్నాథ్ షిండే…
మానుకోట మహాధర్నాలో బీఆర్ఎస్ పాసా? ఫెయిలా? ఆ కార్యక్రమం చుట్టూ వివాదాస్పద చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? భూ కబ్జాదారుల్నే పక్కన పెట్టుకుని పేద రైతులకు న్యాయం చేస్తామని ఎలా అంటారన్న ప్రశ్న ఎందుకు వస్తోంది? ఎవరి కార్యక్రమంలో ఎవరు పెత్తనం చేస్తున్నారన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? లెట్స్ వాచ్. మహబూబ్‌నగర్ జిల్లా లగచర్ల భూ వివాదంలో గిరిజనులపై దాడి జరిగిందని అంటూ… అందుకు నిరసనగా గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌లో ధర్నా నిర్వహించింది బీఆర్ఎస్. గిరిజనులకు రాష్ట్రంలో ఎక్కడ…
ప్రతీ ఏడాది కార్తిక మాసంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది.. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం 17 రోజుల పాటు కొనసాగాయి.. ఈ నెల 25వ తేదీన అంటే.. కార్తిక చివరి సోమవారం రోజు ముగిసింది..
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్, బీజేపీ క్లారిటీకి రాలేకపోతున్నాయా? ఆశావహులు పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నా… అధిష్టానాల వైపు నుంచి ఎందుకు స్పందన లేదు? లెక్కలు పక్కాగా కుదరడం లేదా? లేక అంతకు మించిన సమస్యలు వేరే ఉన్నాయా? అవసరానికి మించిన డిమాండే ఆలస్యానికి కారణం అవుతోందా? లేక అవతలి వాళ్ళని చూసి మనం అభ్యర్థుల్ని ప్రకటిద్దామన్న వైఖరి ఉందా? వచ్చే మార్చిలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ స్థానాల విషయమై తెలంగాణలో ఉత్కంఠ…