Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలపరచడం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను నిర్ణయించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 17న సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు విశాఖపట్నంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు.
ఆగస్టు 18న ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో కీలక సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై సమీక్షిస్తారు. ఉదయం 11 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరించి, ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించి సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేసిన తర్వాత, పార్టీ కార్యకర్తలతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
సాయంత్రం 4 గంటలకు విశాఖ నోవాటెల్ వరుణ్ బీచ్‌లో జరిగే ‘యువ సమ్వాద్’ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌తో వికసిత్ భారత్, ఇన్నోవేషన్, డిజిటల్ లీడర్షిప్ వంటి అంశాలపై ముఖాముఖి చర్చిస్తారు. అంతేకాకుండా.. పార్టీ ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయి పార్లమెంటరీ కార్యక్రమాలు, నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై విస్తృతంగా సమీక్షించనున్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!