మరిదిని అరెస్ట్ చేసి వదినమ్మని వదిలేశారా? లేక ఆయన ఇచ్చే సమాచారంతో నట్లు గట్టిగా బిగించాలన్న ప్లాన్ ఉందా? మాజీ మంత్రి విడదల రజనీ కేసులో ఏం జరుగుతోంది? కేసులో ఏ1గా ఉన్న రజనీ బయట తిరుగుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… ఆమె జోలికి వెళ్ళకుండా ఏ3 అయిన ఆమె మరిదిని వెదికి మరీ ఎందుకు పట్టుకున్నారు? ఏ3 ఇచ్చే సమాచారంతో ఏ1ని గట్టిగా ఫిక్స్ చేయాలనుకుంటున్నారా? ఆ విషయంలో అసలేం జరుగుతోంది? ఏపీ మాజీ మంత్రి…
ఊరించి…ఊరించి ఉసూరుమనిపించారా ..? అదిగో..ఇదిగో అంటూ చెప్పి ఆగమాగం చేసేశారా? జరగాల్సిన చర్చలు, రచ్చలన్నీ జరిగిపోయాక ఇప్పుడు తూచ్ అంటున్నారా? తెలంగాణ కేబినెట్ విస్తరణ కథ కంచికేనా? ఇక ఇప్పట్లో ఆ ఊసే ఉండబోదా? ఆ విషయంలో అసలేం జరిగింది? కేబినెట్ విస్తరణ ఉన్నట్టా..? లేనట్టా..? అదిగో…ఇదిగో అంటూ చేసిన చర్చలన్నీ ఉత్తుత్తివేవా? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్వర్గాలకు వస్తున్న కొత్త ప్రశ్నలివి. వీటికి సమాధానాల కోసం పార్టీలో ఏ నాయకుడిని అడిగినా… ఏమో.. ఎవరికి తెలుసు అన్నదే…
మహానాడు విషయం ఆ టీడీపీ నేతలకు పట్టడం లేదా? స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు కూడా వాళ్ళని కదిలించలేకపోతున్నాయా? కడప టీడీపీ నేతలు ఎందుకు అంత తోలు మందంగా ఉన్నారు? ఇంతవరకు కనీసం స్థలాన్ని ఎంపిక చేయకపోవడం వెనక కారణాలేంటి? కడప టీడీపీ లీడర్స్ మనసులో అసలేముంది? తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటిసారి… ఊహించని రీతిలో గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది టీడీపీ. ఆ ఊపులోనే… ఈసారి మహానాడును కూడా అదే స్థాయిలో…
ఇవాళ బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్ నేడు కూడా వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను విచారించనున్న పోలీసులు.. చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నం ఘటనపై మాధవ్‌ను విచారించనున్న పోలీసులు లిక్కర్ స్కాంలో ఇవాళ కూడా అరెస్టులు జరిగే ఛాన్స్.. ఇప్పటికే ఏ1 రాజ్ కసి రెడ్డి, ఏ8 చాణక్యలను అరెస్టు చేసిన సిట్.. ఇవాళ మరొకరిని అరెస్టు చేయనున్న సిట్ నేడు రాయచోటి,…
బీఆర్ఎస్ అధిష్టానం దేన్నుంచో తప్పించుకోబోయి… ఇంకెక్కడో ఇరుక్కుపోయిందా? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పార్టీని ఇరికించేసిందా? ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? దాని గురించి అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసినా… పొలిటికల్ ప్రకంపనలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లే ప్రధాన ఓటర్లు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ స్థానం నుంచి…
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఊహించని ఝలక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? నిఘా వర్గాలు హెచ్చరించకుంటే… నిజంగానే ఆ షాక్ తగిలి ఉండేదా? ఇప్పటికైనా అధికార పక్షం అలర్ట్ అయిందా? లేక అయితే ఏముందిలే అన్నట్టుగా ఉందా? ఇంటెలిజెన్స్ వార్నింగ్ లేకుంటే అసలేం జరిగి ఉండేది? లెట్స్ వాచ్. ఈ నెల 27న రజతోత్సవ వేడుకలు జరుపుకోబోతోంది బీఆర్ఎస్. ఆ సందర్భంగా కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోందట ఆ పార్టీ అదిష్టానం. అధికార కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడేసేలా…
కావాలంటే రాష్ట్రాన్నే రాసిస్తా… అన్నది ఓ హిట్ మూవీలో మినిస్టర్ కేరక్టర్ పాపులర్ డైలాగ్. ఆ సినిమాని ఎక్కువ సార్లు చూశారో… లేక డైలాగ్‌ని బాగా… ఒంటబట్టించుకున్నారోగానీ… ఆ శాసనసభ్యురాలు నిజంగానే నియోజకవర్గాన్ని సోదరులకు రాసిచ్చేశారట. తాను మాత్రం రిబ్బన్లు కత్తింరించుకుంటూ… బ్రదర్స్ ఇద్దర్నీ నియోజకవర్గం మీదికి వదిలేశారట. జనరల్‌గా దోచుకో, పంచుకో అంటుంటారు. వాళ్ళు మాత్రం పంచుకో దోచుకో అన్న ఫార్ములాని ఫాలో అవుతున్నార. ఇంతకీ ఎవరా నామమాత్రపు ఎమ్మెల్యే? ఏంటా బ్రదర్స్ దోపిడీ కహానీ?…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదా? జోడెద్దుల్లా నడిపించాల్సిన ఆ నాయకుడే నత్తనడకన ఉన్నారా? నిజంగా ఆయన పని చేయడం లేదా? లేక చేయనివ్వడం లేదా? అందివచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని వాడుకోలేకపోతున్నారని చర్చ జరుగుతున్న ఆ నాయకుడు ఎవరు? ఎందుకంత సంక్లిష్టతలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవడమంటే అంత ఈజీ కాదు, ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా ఈక్వేషన్స్ అండ్ కేలిక్యులేషన్స్ ఉంటాయి. కానీ… తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్‌గౌడ్…
ఏపీలో రోడ్లు, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చే రహదారులను ఆయన పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు చెప్పారు. ప్రధాని…
వీరయ్య చౌదరి అంత్యక్రియలలో పాల్గొననున్న సీఎం: దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో…