వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఆ ఎమ్మెల్యేలు పొలిటికల్ సఫకేషన్ ఫీలవుతున్నారా? దానికైతే ఏసీ వేసుకుంటే సరిపోతుందిగానీ… దీనికేం చేయాలో అర్ధంకావడం లేదని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే చిటపటలాడి పోతున్నారా..? ఎందుకా టీడీపీ శాసనసభ్యులు అంత అసహనంగా ఉన్నారు? వాళ్లకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఉమ్మడి విశాఖజిల్లాలో కూటమి రాజకీయం వేడెక్కుతోంది. వ్యవస్ధ, వైఫల్యాలపై ప్రతిపక్షం కంటే ఎక్కువగా అధికార పార్టీ నాయకులు గళమెత్తడం చర్చనీయాంశమవుతోంది. పైగా… అసంత్రుప్తి స్వరం వినిపిస్తున్న వాళ్ళంతా సీనియర్సే కావడంతో..…
మూడు ప్రధాన కాలువలకు సాగునీటి సరఫరా నిలిపివేత: తూర్పుగోదావరి జిల్లా గోదావరి డెల్టా పరిధిలోని మూడు ప్రధాన కాలువలకు ఈరోజు అర్ధరాత్రి నుండి సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. దాంతో డెల్టా పరిధిలోని మూడు కాలువలు గురువారం ఉదయం నుండి మూసివేయనున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పది లక్షల 13వేల ఎకరాల వరి సాగుకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. రబీ పంటలు పూర్తయి కోతలకు రావడంతో సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు.…
నేడు ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 10.30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్న సీఎం ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగవ రాజ్యసభ స్ఖానాన్ని భర్తీ చేసే అంశంపై నేడు నిర్ణయం.. నామినేషన్ పత్రాల దాఖలుకు ఈ నెల 29వ తేదీ తుది గడువు ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ…
13 మంది భక్తులకు గాయాలు: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో వాలాల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. టైం స్లాట్ టోకెన్ తీయిస్తామంటూ రైల్వే స్టేషన్ వద్ద భక్తులకు ఎక్కించుకుని వేగంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమయం ముగిస్తే భక్తుల వద్ద తీసుకున్న డబ్బులు రిటన్ ఇవ్వాల్సి వస్తుందనే అలోచనతో ఓ ఆటో డ్రైవర్ ఒవర్ టేక్ చేసే సమయంలో ముందున్న జీపును డీకోట్టాడు. దీంతో ఆటోలొ ప్రయాణిస్తున్న…
నేడు అల్లూరి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన.. అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించినున్న మంత్రి సంధ్యారాణి నేడు సిట్ విచారణకు మరోసారి రానున్న రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డి.. సోమవారం సిట్ విచారణకు రావాలని ఉపేంద్ర రెడ్డికి సిట్ పిలుపు.. ఇప్పటికే రెండు రోజులు ఉపేంద్ర రెడ్డిని విచారించిన సిట్ ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 బెంగుళూరు నుంచి…
ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మాటకు కూడా విలువ లేకుండా పోతోందా? సీఎం చెబితే ఏంటి? మా దారి మాదే, మా బెదిరింపులు మావేనన్నట్టుగా ఎమ్మెల్యే అనుచరుల వ్యవహారం ఉందా? తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు బెదిరింపుల సెగ ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయి కంపెనీలనే టచ్ చేసిందా? వాళ్ళ దెబ్బకు ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వస్తోందా? ఏదా నియోజకవర్గం? ఏ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు అవి? ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లు కడప జిల్లా జమ్మలమడుగు. ప్రత్యర్థుల…
మూల విరాట్‌కే దిక్కులేక ఓ మూలన ఉంటే…. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగిందన్నది సామెత. ఇప్పుడక్కడ కారు పార్టీ పరిస్థితి అచ్చుగుద్దినట్టు అలాగే ఉందట. పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… పాదయాత్ర చేశామా? లేదా? అన్నదే ముఖ్యం అంటూ కొందరు జూనియర్స్ చెలరేగిపోతుంటడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. సమ్మర్ సెగల్ని మించిన రేంజ్లో వర్గపోరు ఎక్కడ జరుగుతోంది? ఏంటా కథ? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ లీడర్స్ కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారట. ప్రేమగా…
డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసుపై కూటమి సర్కార్ స్పెషల్‌గా దృష్టి పెట్టిందా? ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీకి మూడినట్టేనా? ఈ కేసులో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోందా? ఇందులో ఎమ్మెల్సీ తప్పును నిరూపించగలిగితే… వైసీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్‌ని కూడా కదిలించవచ్చని అనుకుంటోందా? ఆ కేసు విషయంలో జరిగిన తాజా డెవలప్మెంట్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని షేక్ చేసిన అంశాల్లో డెడ్‌బాడీ డోర్ డెలివరీ…
ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారా? లేక భయపడ్డారా? అత్యంత కీలకమైన పార్టీ మీటింగ్‌కు ఎందుకు డుమ్మా కొట్టారు? దాని గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయనకు భయమెందుకు? ఒకవేళ అలిగితే రీజనేంటి? అధికారంలో ఉన్నాసరే… అంత యాక్టివ్‌గాలేని కాంగ్రెస్ శ్రేణుల్ని రీ ఛార్జ్ చేసే పని మొదలుపెట్టారట తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌తో కలిసి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారామె. ఈ సందర్భంలోనే… పలు లోటుపాట్లు బయటపడుతున్నట్టు…