ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన.. సీ క్యాంప్ రైతు బజార్లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్న సీఎం నేడు కాకినాడ టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల సమావేశం.. మినీ మహానాడు నిర్వహణపై చర్చించనున్న నేతలు మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు.. సాయంత్రం స్వామి వారిని రథంపై ఊరేగింపు నేడు గుంటూరు జిల్లా బొంగరాలబీడు స్మశానవాటికలో ఎలక్ట్రికల్ క్రెమోషన్…
ఆ ఇద్దరు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటే ఏంట్రీ పాస్ కావాల్సిందేనా? ఆ ఇద్దరు సీనియర్స్ ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేకపోతున్నారా? సీనియర్ మినిస్టర్స్ జూనియర్ ఎంపీలను తొక్కేస్తున్నారన్నది నిజమేనా? మరి ఎంపీలు కనీసం క్యాంప్ ఆఫీస్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఎవరా మంత్రులు, ఎంపీలు? జనం ఓట్లేసి గెలిపించారు. కానీ… ఇప్పుడు వాళ్ళకే దూరమైపోతున్నామంటూ తెగ ఫీలైపోతున్నారట నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నియోజకవర్గాల్లో అభివృద్ధి,…
తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి అటా.. ఇటా..? ఎటు? ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధంగాని గందరగోళంలో ఉన్నారా? ఏంటి….? అసలేంటి… మాకీ ఖర్మ అంటూ పార్టీ నాయకులు తలలు బాదుకుంటున్నారా? అధికారంలో ఉన్న పార్టీ లీడర్స్‌కు అంత కష్టం ఏమొచ్చింది? క్రాస్‌రోడ్స్‌లో ఉన్నట్టుగా ఎందుకు ఫీలవుతున్నారు? పూటకో మాట, రోజుకో రూల్ అన్నట్టుగా ఉందట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. వాళ్ళకు వాళ్ళే రూల్స్ పెట్టుకుంటారు. పాటించకుండా నీరుగార్చేది కూడా వాళ్ళే. ఈ క్రమంలో తాజాగా…
జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం: జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అని, బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం అని చెప్పారు. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని పురంధేశ్వరి ప్రశంసించారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి గుడ్…
ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జకియా ఖానం రాజీనామాను ఆమోదిస్తే.. డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా పోతుంది. జకియా ఖానం స్వస్థలం…
నేడు కల్లితండాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాలను…
ఇవాళ ఏపీకి కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖా మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోనీ కేంద్ర బృందం.. సీఎం చంద్రబాబుతో సమావేశం మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత బలోపేతంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కీలక అంశలపై సమీక్ష ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అన్ని బస్టాండుల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎంయూఏ ధర్నాలు.. తమ డిమాండ్లు పూర్తి…
11వేల కోట్ల స్కాం జరిగింది: కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలం నుండి సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు 11వేల కోట్ల స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. అధికారంలోకి…
వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి…