తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా? సీనియర్స్ ఎక్కువ మంది ఇప్పటికీ అలకపాన్పులు దిగలేదా? పదవులు రాలేదన్న బాధ ఒకరిదైతే… వచ్చిన వాళ్ళతో సైతం అసంతృప్తులు పెరుగుతున్నాయా? గతంలో రెగ్యులర్‌గా పార్టీ ఆఫీస్‌కు వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు గేటు దగ్గరికి కూడా ఎందుకు రావడం లేదు? పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తుల పర్వానికి తెర లేచింది. ఆ విషయమై పార్టీలో ఆనందించే వారికంటే… ఇప్పుడు ఆవేదనతో…
ఆ వైసీపీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిస్తే…. ఆయన నియోజకవర్గాన్ని వదిలి విజయవాడలో ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి హాజరవకూడదనన్న వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆయనకు మింగుడు పడటం లేదా? శాసనసభ్యుడి కదలికల మీద స్వపక్షం, అధికారపక్షం ఓ కన్నేసి ఉంచాయా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్పెషల్ స్టోరీ? రేగం మత్స్యలింగం….అరకు ఎమ్మెల్యే. 2024లో కూటమి దూకుడుని తట్టుకుని వైసీపీ గెలిచిన 11మందిలో ఒకరు. టీచర్ టర్న్డ్ పొలిటీషియన్ ఈయన. గత ఎన్నికలకు…
ఆ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల విన్యాసాలు చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారా? క్రెడిట్ వార్‌లో పడుతున్న పాట్లు చూసి… వీళ్ళెక్కడ దొరికార్రా నాయనా… ఆళ్లనెవరికన్నా చూపించండర్రా అని అంటున్నారా? అయినా సరే… తగ్గేదేలే, సిగ్గుపడేదేలే అంటున్న ఆ నాయకులెవరు? అసలు ఏ విషయంలో పోటీపడి పరువు తీసుకుంటున్నారు? మంచిర్యాల జిల్లాలో వందేభారత్ రైలు హాల్ట్ కావాల్సినంత పొలిటికల్ కలర్ పులుముకుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. తాము ప్రయత్నం చేస్తేనే ఇక్కడ వందేభారత్ రైలును…
జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఇవి కచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతికి ఊరట ఇస్తాయనే నమ్మకంతో ఉంది. ఆర్థిక మంత్రి అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెబుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రాముల్లో మంచి స్పందన వచ్చిందనే భావనతో ఉన్నారు.
కొత్త జీఎస్టీ రేట్ల ప్రకటనతో.. దేశ ప్రజలకు పండగ సీజన్ ముందే వచ్చినట్టైంది. ప్రధాని చెప్పినట్టుగానే.. నిత్యావసరాలు చాలా వరకు తక్కువ పన్నురేటులోకి వచ్చేశాయి. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ మినహాయింపుపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమౌతోంది. జీఎస్టీ హేతుబద్ధీకరణ సరే.. కేంద్రం నష్టాన్ని ఎలా పూడ్చుకుంటుంది..? రాష్ట్రాలకు వచ్చే రెవిన్యూ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తుంది..?
ప్రస్తుతం కవిత సస్పెన్షనే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వరుస ప్రెస్ మీట్లతో బీఆర్ఎస్ను ఆమె డిఫెన్స్ లో పడేస్తోంది. అలాగని కవితను తక్కువగా అంచనా వేయడానికి ఆస్కారం లేదు. మొదట్నుంచీ కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్‌తో కలిసి ఉన్న కవిత.. చెప్పే మాటలు, చేసే ఆరోపణలు కచ్చితంగా జనం నమ్మే అవకాశం ఉంది. ఈ విషయమే బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది.
బెజవాడలో ఆ లీడర్‌కి సీనియారిటీ ఉన్నా... కాలం కలిసి రావడం లేదా? వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అంటూ... పదిహేనేళ్ళు వెయిట్ చేశాం. ఇక మావల్ల కాదని ఆ నేత అనుచరగణం ఎందుకు అంటోంది?
ఆ ఐఏఎస్ అధికారులకు కొత్త టెన్షన్ పట్టుకుందా? గండం గట్టెక్కాంరా.. దేవుడా అని ఊపిరి పీల్చుకుంటున్న టైంలో... పిడుగు పడ్డట్టయిందా? మళ్ళీ క్వశ్చన్ టైం వచ్చేసిందంటూ టెన్షన్ పడుతున్నారా? చివరికి కొందరు రిటైర్డ్ ఐఎఎస్‌లకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందా?
కవిత టార్గెట్ ఆ ఇద్దరేనా? ఇక ఫైనల్ లెక్కలు తేలిపోయినట్టేనా? తండ్రి దేవుడు, అన్నకు జాగ్రత్త అంటూ సూచనలు... హరీష్‌రావు, సంతోష్‌రావు మీద తీవ్ర ఆరోపణలు. సో... పిక్చర్ క్లియర్ అయిపోయినట్టేనా? దాని గురించి బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి?
పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.