TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Vijay: తమిళనాడులో సినీ హీరో విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పడి నుంచి.. పొత్తులపై రకరకాల ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు ఎన్నికల తేదీలను కూడా ప్రకటించడంతో.. పొత్తుల వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది.. విజయ్ పార్టీకి చెందిన కీలక నేతలు.. ఓ వైపు భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని.. ఇన్ని సీట్లు, డిప్యూటీ సీఎం పోస్ట్.. టీవీకేకు ఇచ్చేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.. మరోవైపు.. డీఎంకేతోనూ చర్చలు సాగుతున్నాయనే లీక్‌లు వస్తున్నాయి..
Read Also: PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ఈ నేపథ్యంలో.. పొత్తులపై టీవీకే అధినేత విజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరితోనూ పొత్తు పెట్టుకోను అని స్పష్టం చేశారు.. ముఖ్యంగా ఎన్టీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు” అని విజయ్ కుండబద్దలు కొట్టారు.. మరోవైపు.. నన్ను అణిచివేయాలని కుట్రలు చేస్తున్నారు అని కూడా విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు టీవీకే అధినేత విజయ్..
కాగా, టీవీకే-బీజేపీ పొత్తుల కోసం సినీ నటి త్రిష రంగంలోకి దిగిందని.. ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోనూ చర్చలు జరిపినట్టు కూడా సోషల్ మీడియాలో కొంత ప్రచారం సాగుతోన్న విషయం విదితమే.. మరోవైపు.. విజయ్‌కు ఒక జాతీయ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేసిందని టీవీకే నేత అధవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే, ఈ ఆఫర్‌ను విజయ్ తిరస్కరించినట్లు అర్జున తెలిపారు. తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రభావం స్పష్టంగా ఉంటుందని.. అందుకే విజయ్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. అయితే, 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాట ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి..
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!