మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పెను సంచలనానికి కేంద్ర బిందువు కాబోతున్నారా? సొంత పార్టీ నేతల మీద వేయడానికి హైడ్రోజన్ బాంబులు సిద్ధం చేసుకున్నారా? ఎక్కడ ల్యాండ్ అవ్వాలో పర్‌ఫెక్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ… ఫీలర్స్ వదిలారా? మాజీ ఎమ్మెల్యేని అంతలా డిస్ట్రబ్ చేసిన ఆ నాయకులు ఎవరు? ఎందుకలా జరిగింది? అవును….. నేను డిస్ట్రబ్ అయ్యాను. చాలా…. డిస్ట్రబ్ అయ్యాను. అది ఎవరి వల్ల…? ఎందుకన్నది వచ్చే మేలో బహిరంగంగా చెప్పేస్తానని అన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ స్టేట్‌మెంట్ చుట్టూనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఫ్లాష్‌బ్యాక్ సుడులు తిరుగుతున్నాయి. రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. నిన్నటి దాకా…. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీని వెనకేసుకువచ్చిన జగ్గారెడ్డి ఉన్నట్టుండి ఒకే సారి ఎందుకు అలా యూ టర్న్ తీసుకున్నారు? ఎక్కడ డిస్ట్రబ్ అయ్యారంటూ… బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అన్నిటికీ మించి ఆయన చెప్పబోయే సీక్రెట్ ఏంటి? ఎవరి గుట్టుమట్లు విప్పి రోడ్డు మీదికి లాగబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మాజీ ఎమ్మెల్యే నైజం తెలిసిన వాళ్ళంతా చెప్పేది ఒకటే మాట. అలాంటి ఇండికేషన్ ఇచ్చారంటే… కచ్చితంగా ఏదో జరగబోతోందనే. ఆషామాషీగా స్టేట్‌మెంట్స్ ఇచ్చే రకం కాదాయన అని అంటున్నారు. కీలక శాఖలు చూస్తున్న ఇద్దరు మంత్రుల తీరుపై కొంతకాలంగా నారాజ్‌తో ఉన్నారు జగ్గారెడ్డి. ఆ ఇద్దరూ కేవలం వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారే తప్ప…ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని సన్నిహితుల దగ్గర అంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ టూ నేనే అని కొంత కాలం క్రితం ప్రచారం చేసుకున్న మంత్రి విషయంలో అయితే…మాజీ ఎమ్మెల్యే బాగా కోపంతో ఉన్నట్టు సమాచారం. ఒకటి…రెండు సార్లు ఫోన్‌లో కూడా ఘర్షణ పడ్డారని తెలుస్తోంది. ఆయన శాఖకు సంబంధించిన జిల్లా అధికారి..మంత్రి చెప్తేనే పనులు చేస్తున్నారట.
తన నియోజక వర్గంలో మంత్రి జోక్యం ఏంటనేది ఒకటైతే..అధికారులను అడ్డంపెట్టుకుని సంగారెడ్డి పరిధిలో భూముల సెటిల్‌మెంట్స్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఇదే విషయాన్ని గతంలో సదరు మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారట జగ్గారెడ్డి. కానీ తీరు మారక పోగా…. కంటిన్యూ అవుతుందని, అందుకే జగ్గన్న మండిపోతున్నారని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇంకో సీనియర్ మంత్రి వ్యవహార శైలి పై మొదటి నుండి కొంత గరం గరం గానే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. పార్టీ శాసనసభ్యులకు పనులు చేయకుండా కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నది జగ్గారెడ్డి అభిప్రాయమ అట. పార్టీకి లాయలిస్ట్‌నని చెప్పుకుంటూ… కార్యకర్తలను…నాయకులను కనీసం పట్టించుకోవడం లేదని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఓ మంత్రి.. మరో సీనియర్ మంత్రి ఇద్దరే అంతా తానై..పనులు చేసుకుంటున్నారన్న ఫీలింగ్ బలంగా ఉందట జగ్గారెడ్డికి. ముందు ఆ ఇద్దరు నేతల గుట్టు విప్పిన తర్వాత… కీలక నాయకుడి గురించి కూడా కామెంట్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. బయటికి తానేం చెప్పబోతున్నానో ఆ విషయాన్ని ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతకు చెప్పేసినట్టు తెలిసింది. విన్నాక ఆయన కూడా నేనేం చేయలేను ఇక నీ ఇష్టం అని చేతులెత్తేసినట్టు తెలిసింది.చెప్పడానికి కూడా నేను అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదని అన్నారట. ఆ విధంగా జగ్గారెడ్డి… ముందు ఇద్దరు నాయకులతో మొదలుపెట్టి… ఏఐసీసీలో ముఖ్య నేతల గుట్టు కూడా విప్పాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఆ వ్యూహంలో భాగంగానే…నేను డిస్ట్రబ్ అయ్యానంటూ…నేరుగా ఎవరికి తాకాలో వాళ్లకు తగిలేలా మీడియా సమావేశంలో కామెంట్ చేశారన్న అభిప్రాయం ఉంది. మేలోపు సదరు లీడర్స్ పద్ధతి మార్చుకుంటే సరే సరి. లేదంటే తన దారిలో తాను వెళ్ళాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. చూడాలి మరి జగ్గారెడ్డిని అంతగా డిస్ట్రబ్ చేసిన నేతలు ఎవరు..? వాళ్ళ గురించి ఏం చెప్తారనేది. మేదాకా టైం ఉంది కాబట్టి ఆలోపు పార్టీ నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్.