ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. నువ్వు లేక నేను లేనని సాంగులు సింగుకున్న వాళ్ళే. కట్ చేస్తే… ఇద్దరి మధ్య భీకరమైన శతృత్వం. ఆవతలాయన నోట్లో నుంచి మాట బయటికి వచ్చీరాక ముందే ఇవతలాయ కౌంటర్స్‌తో రెడీ అయిపోతున్నారు. ఒకరు మాజీ మంత్రి, మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎవరా ఇద్దరు లీడర్స్? జాన్జిరిగీల మధ్య ఎందుకంత జగడం? గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…గుడివాడ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. సన్నిహితులు…స్నేహితులు కూడా.…
కాస్తో కూస్తో పార్టీ నష్టపోయినా ఫర్లేదుగానీ, మన పరంపరకు మాత్రం బ్రేక్ పడకూడదని ఆ సీనియర్ లీడర్ అనుకుంటున్నారా? అందుకే అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారా? ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉండి కూడా… అధికార పార్టీని అందుకే గట్టిగా టార్గెట్ చేయలేకపోతున్నారా? మా సార్ స్లో మోషన్ లీడర్ అని ఎవరి గురించి వైసీపీ కేడర్ అనుకుంటోంది? అసలేంటా అండర్స్టాండింగ్ పాలిటిక్స్? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు మిగతా వాటికంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. రెండు ప్రధాన…
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పెను సంచలనానికి కేంద్ర బిందువు కాబోతున్నారా? సొంత పార్టీ నేతల మీద వేయడానికి హైడ్రోజన్ బాంబులు సిద్ధం చేసుకున్నారా? ఎక్కడ ల్యాండ్ అవ్వాలో పర్ఫెక్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ… ఫీలర్స్ వదిలారా? మాజీ ఎమ్మెల్యేని అంతలా డిస్ట్రబ్ చేసిన ఆ నాయకులు ఎవరు? ఎందుకలా జరిగింది? అవును….. నేను డిస్ట్రబ్ అయ్యాను. చాలా…. డిస్ట్రబ్ అయ్యాను. అది ఎవరి వల్ల…? ఎందుకన్నది వచ్చే మేలో బహిరంగంగా చెప్పేస్తానని అన్నారు మాజీ ఎమ్మెల్యే…
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ… ఆ ఎమ్మెల్యేలు మాత్రం సొంతూళ్ళనే ప్రత్యర్థులకు సమర్పించుకున్నారు. ఒకాయన అయితే… స్వగ్రామంలో సోదరుడిని కూడా గెలిపించుకోలేకపోయారు. అంత దారుణమైన ఫలితాన్ని చవిచూసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకలా జరిగింది? తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాయి. ఈ ఫలితాలు చూస్తుంటే… గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పార్టీ పట్టు తగ్గలేదన్న సంగతి అర్ధమవుతోందని అంటున్నారు హస్తం లీడర్స్. అదంతా ఒక ఎత్తయితే… అదే పార్టీకి చెందిన…
జనసేనకు ఆయువుపట్టుగా నిలిచిన ఆ జిల్లాలో ఇప్పుడు పరిస్థితి తల్లకిందులవుతోందా? ఎగిరెగిరి దంచినా అంతే…. ఎగరకుండా దంచినా అంతేనంటూ ఏకంగా జిల్లా అధ్యక్షుడే కాడి పడేశారా? అధినేత ఆంతర్యాన్ని గమనించకుండా ఎమ్మెల్యేలు సొంత అజెండాతో ముందుకు పోతూ… పార్టీ పరువు తీస్తున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? జనసైనికులు ఏమంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఆరు సీట్లు అందించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జోష్ మీద కనిపించాల్సిన పార్టీ నేతల్లో అసంతృప్తితో పాటు అయోమయం కూడా పెరిగిపోతోంది.…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితేంటి? గ్రామీణ ప్రజానీకం వాళ్ళని నమ్మారా? లేక మేం నమ్మి ఓట్లేస్తే మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మారిపోయారని తిరస్కరించారా? ఏ నియోజకవర్గంలో ఎవరి సంగతి ఎలా ఉంది? వాళ్ళు కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యారా? లేక మైనస్‌గా మారిపోయారా? లెట్స్ వాచ్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు ముగియగా… వచ్చే 17న మూడో విడత జరుగుతుంది. మొదటి రెండు విడతల్లో అధికార కాంగ్రెస్…
Drug Injection Scam: పాతబస్తీలో జోరుగా మత్తు ఇంజక్షన్ల దందా జోరుగా కొనసాగుతుంది. మత్తు ఇంజక్షన్ దందాపై ఎన్టీవీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అనస్థీషియా డ్రగ్ తీసుకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. మత్తు ఇంజెక్షన్ల ఓవర్ డోస్ తో యువకులు చనిపోయినట్లు పోలీసులు తేల్చారు.
పరిపాలన మీద పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తెలంగాణ సీఎం కసరత్తు మొదలుపెట్టారా? పాత వాసనలు లేకుండా అడ్మినిస్ట్రేషన్‌ను గాడిలో పెట్టాలని డిసైడయ్యారా? అందు కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకోబోతున్నారా? ఏంటా ప్రత్యేక జాగ్రత్తలు? ముఖ్యమంత్రి రేవంత్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 17న మూడో విడత పోలింగ్ ముగియగానే ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి… పరిపాలనా ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారట సీఎం…
ఏపీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ విషయమై వైసీపీలో వాయిస్ తేడాగా ఉందా? ఎక్కువ మంది నాయకులు యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నారా? మీరు ఏదేదో ఊహించేసుకోవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు గురూ… అంటూ ముందే సందేశం పంపుతున్నారా? ప్రతిష్టాత్మక పోరులో ప్రతిపక్ష నేతల వెనకడుగుకు కారణం ఏంటి? వాళ్ళు చెబుతున్న ఆసక్తికరమైన లెక్కలేంటి? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతోంది. షెడ్యూల్ ప్రకారం అయితే… 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. గ్రామ…
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే బ్యాచ్ చాలామందే ఉంటారు. ముఖ్యంగా పాలిటిక్స్‌లో అయితే… ఈ బాపతు ఇంకాస్త ఎక్కువ. ఎక్కడ… మైలేజ్‌లో మనం వెనుకబడిపోతామోనన్న కంగారులో క్రాస్ చెక్ చేసుకోకుండా ఏదిబడితే అది మాట్లాడే లీడర్స్‌కు కొదవేలేదు. ఇప్పుడో మాజీ ఎంపీ కూడా అలాగే మాట్లాడి ఇరుక్కుపోయారట. సమాధానం చెప్పండి సార్…అంటూ పోలీసులు వెంటాడుతున్న ఆ మాజీ ఎంపీ ఎవరు? ఏమన్నారాయన?రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు… ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్. కాకపోతే…. మనం ఏం మాట్లాడుతున్నామన్న స్పృహ…