మంచి తరుణం మించిన దొరకదు…., దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందాం…, దుమ్ము దులిపేద్దామన్నట్టుగా ఆ ఎమ్మెల్యే మనుషులు వసూళ్ళ పర్వానికి తెర లేపారా? మాట వినే అధికారులను డిప్యుటేషన్ మీద రప్పించుకుని మరీ… వ్యవహారాలు చక్కబెట్టేసుకుంటున్నారా? అసలక్కడ ఉద్యోగం చేయాలంటేనే… రెగ్యులర్ ఎంప్లాయిస్ భయపడే పరిస్థితి వచ్చిందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం. పరిధి చిన్నదే అయినా… పొలిటికల్‌గా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్. ఇక్కడి నుంచి 2024ఎన్నికల్లో జనసేన తరపున…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారా? అప్పట్లో ఆమె ఏదేదో… ఊహించేసుకుంటే… ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఇంకేదో జరిగిపోతోందా? అట్నుంచి ఇటువైపు దూకుతారనుకుంటే… ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా టాటా బైబై చెప్పేయడం కంగారు పెడుతోందా? చివరికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆమె ఆశల మీద నీళ్ళు చల్లాయా? ప్రస్తుతం కవిత శిబిరం అంచనాలేంటి? కాలం గడిచేకొద్దీ…. కవిత శిబిరంలో కంగారు పెరుగుతున్నట్టు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో.…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కుదుపుల మీద కుదుపులు పెరిగిపోతున్నాయా? మనం మరీ… అంత పనికిమాలిన తరహాలో ఉన్నామా? ఓ మాదిరిగా కూడా చేయలేకపోతున్నామా? వాళ్ళు చెబుతున్నది నిజమేనా అంటూ… మినిస్టర్స్లో తీవ్ర అంతర్మథనం పెరిగిపోతోందా? ఏ విషయంలో మంత్రులు అంతలా ఫీలైపోతున్నారు? ఏకంగా కేబినెట్ కేబినెట్ గుసగుసలాడేసుకుంటున్న ఆ అంశం ఏది? అవునా… నిజమా…. పబ్లిసిటీలో మనం మరీ అంత వెనకబడిపోయా? నిజంగానే చేసింది చెప్పుకోలేక పోతున్నామా? మనం సరిగా చెప్పలేకపోతున్నామా? లేక అది జనానికి సక్రమంగా అర్ధం…
ఎన్నాళ్ళు…? ఇంకెన్నాళ్ళు ఎదురు చూపులు…? అవతలోళ్ళు దూసుకుపోతుంటే… మేం చేతులు కట్టుకుని చోద్యం చూడ్డం ఇంకెన్ని రోజులు…? ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీ ఎందుకు తేల్చుకోలేకపోతోంది? ఎక్కడ బ్రేక్స్ పడుతున్నాయి? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక వేడి పెరుగుతోంది. ప్రధాన పార్టీల.. హడావిడి మొదలైపోయింది. BRS, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి కూడా. వాళ్ళు ప్రచారం కోసం…
సీట్ల వేటలో సిద్ధాంతాలు మరుగునపడిపోయాయా? చావో రేవో ఒకరితోనే… అనే స్థాయి నుంచి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళవైపేనంటూ ఎదురు చూసే స్థాయికి వాళ్ళ రాజకీయం దిగజారిపోయిందా? అది కూడా… ఒకే రకమైన ఎన్నికల్లో… ఒకేటైంలో మండలానికో పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా చూడాలి? ఏమని పిలవాలి? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏ పార్టీ చేస్తోందా పని? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలదే హవా. జిల్లా వరకు వాళ్ళ మాటే శాసనంగా నడిచేది. అవి…
హైదరాబాద్‌లో పొలిటికల్ ఫ్యామిలీ స్టార్స్‌కు దిక్కులేకుండా పోయిందా? తండ్రులు ఓ వెలుగు వెలిగిపోగా… వారసులు ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతున్నారా? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ వాళ్ళని లైట్ తీసుకున్నాయా? ఫేడౌట్ అయిపోవడానికి కారణం వాళ్ళలో సత్తా లేకపోవడమా? లేక పార్టీల పట్టింపులేని తనమా? ఎక్కడుంది లోపం? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగబోతున్న టైంలో… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతల వారసుల వైపు మళ్లుతోంది చర్చ. ఒకప్పుడు గ్రేటర్…
స్థానిక ఎన్నికల వేళ ఆ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారా? పార్టీ పెద్దలు కూడా... కమ్ కమ్ వెల్కమ్ అంటున్నా లోకల్ ఈక్వేషన్స్ మాత్రం రివర్స్ అవుతున్నాయా? సీఎంతో ఉన్న సాన్నిహిత్యం ఫైనల్‌గా ఆ లీడర్‌కి కలిసొస్తుందా? లేక అడ్డంకి అవుతుందా? ఎవరా మాజీ శాసనసభ్యుడు? ఏంటా జంపింగ్ జపాంగ్ కహానీ? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఎర్రశేఖర్.
Story board: ఆరంకెల జీతం.. బిందాస్ లైఫ్.. సాఫ్ట్ వేర్ జాబ్. ఒక్కసారి ఆ సంస్థలో చేరితే తిరుగుండదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేయొచ్చనుకునే వాళ్లు టెకీలు. కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విషమ పరీక్ష ఎదుర్కొంటోందా? మరీ ముఖ్యంగా… ఆ పది నియోజకవర్గాల్లో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయా? బీ ఫామ్స్ ఎవరు ఇస్తారన్న విషయమై లొల్లి మొదలైందా? అది విజయావకాశాల్ని సైతం దెబ్బ తీస్తుందన్న భయాలు పెరుగుతున్నాయా? ఆ విషయమై పార్టీలో ఏం జరుగుతోందసలు? స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. అందుకు సంబంధించి రాష్ట్ర…
జనసేనలో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్, పాత వర్సెస్ కొత్త అంటూ… రచ్చ రాజకీయం నడుస్తోందా? నేతల మధ్య సయోధ్య నేతి బీరలో నెయ్యేనా? ప్రత్యేకించి అత్యంత కీలకమైన ఆ జిల్లాలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి అంతర్గత విభేదాలు చేరుకున్నాయా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? బూస్ట్ కావాలా బాబూ అంటూ సెటైర్స్ ఎందుకు పడుతున్నాయి? జనసేన పెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులకు, అధికారంలోకి వచ్చాక చేరిన వాళ్ళకు మధ్య లెక్కలు కుదరడం లేదని తెలుస్తోంది.…