ఆ ఎమ్మెల్యే కావాలని అన్నారా? లేక కాకతాళీయంగా అన్నారా? అదీఇదీ కాకుండా... విపరీతమైన ఫ్రస్ట్రేషన్ విచక్షణ మర్చిపోయారా? ఓటేసినంత మాత్రాన ఇంటికొచ్చి కడగమంటారా అని జనాన్ని తిట్టేంతలా ఎందుకు దిగజారిపోయారాయన?
ఆయుధాల్ని అవసరం వచ్చినప్పుడే వాడాలి..... లేదంటే అవే ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రాలుగా మారుతాయన్నది యుద్ధ నీతి. రాజకీయ యుద్ధం కూడా అందుకు మినహాయింపేం కాదు. ఇప్పుడా నియోజకవర్గంలో అదే పరిస్థితి కనిపిస్తోందట.
తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకి, పోలీస్ ఆఫీసర్కు మధ్య పెరిగిన వివాదం అసెంబ్లీకి చేరిందా? ఎమ్మెల్యే అంటే లెక్కేలేనట్టుగా… ఏం చేసుకుంటావో చేసుకో పొమ్మని ఓ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడారా? అది రాజకీయ రచ్చకు దారి తీసిందా? అసలు ఏ విషయంలో మాటలు అంతదాకా వెళ్ళాయి? ఎవరా ఇద్దరు? హైదరాబాద్లో కోట్ల విలువైన ఒక భూ కుంభకోణం. అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఓ రాజకీయ వ్యూహకర్త హస్తం. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి దొంగ…
సిక్కోలు టీడీపీలో కులాల కుంపట్లు అంటుకుంటున్నాయా? మేటర్ తూర్పు కాపు వర్సెస్ కాళింగలా మారిపోయిందా? వెలమ నేతలు ఎటువైపు మొగ్గితే అటు ప్లస్ అవుతుందా? అసలు జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది? ఏ విషయంలో కుల కోణాలు ముందుకు వచ్చాయి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ ఎక్స్ట్రా ఫోకస్ చేసిందా ? కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ఒక ఎత్తయితే... అందులో అన్ని అంశాలను సమ్మిళితం చేస్తోందా? అందుకే రేస్ నుంచి అజారుద్దీన్ను తప్పించేసిందా ?
ఎప్పుడొచ్చాం అన్నది కాదు. జనం హృదయాలు గెల్చుకున్నామా లేదా? ఎక్కడా తగ్గకుండా నెగ్గుకువచ్చామా లేదా? తెలుగు వార్తా తరంగిణిలో జరగని అధ్యాయమై, తక్కువ కాలంలో మీడియా రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం అంటే అది ఆషామాషి కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఎన్టీవీ. మాట చెప్పడం, మాటివ్వడం చాలా సులువు. కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా..! దానికి కట్టుబడడంఅంత తేలికైన విషయం మాత్రం కాదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో అవరోధాలు, అంతకుమించి కష్టనష్టాలు.…
ఆ మాజీ మంత్రికి తత్వం బోథపడిందా? అందలం ఎక్కించిన పార్టీనే అధికారంలో లేనప్పుడు లైట్ తీసుకున్నదానికి ఫలితం అనుభవిస్తున్నారా? అందుకే…. పొలిటికల్ చాణక్యం తెలిసిన సదరు లీడర్ ఇప్పుడు ప్లాన్ బీ అమలు చేస్తున్నారా? అందుకే ఇప్పుడు పార్టీ పెద్దలకు వంగి వంగి దండాలు పెడుతూ రండి… రండి… రండి… దయచేయండని స్వాగతాలు పలుకుతున్నారా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఏంటా కథ? గంటా శ్రీనివాసరావు….భీమిలి ఎమ్మెల్యే. మాజీమంత్రి. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత.…
ఐఎఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే భూమన ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడారు? పైగా తమ పార్టీ అనుకూల ముద్ర ఉన్న ఆఫీసర్ని రాక్షసులతో పోల్చడానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఆమెను టార్గెట్ చేసి ఇంకెవరికో సందేశం పంపాలనుకున్నారా? చివరికి చీరలు, విగ్గులు అంటూ…. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం వెనకున్న వ్యూహం ఏంటి? మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మీద చేసిన ఆరోపణలు రాజకీయంగా… పెను…
కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అసెంబ్లీలో చర్చించాక తదుపరి చర్యల మాటేంటి? ఏ తరహా ఎంక్వైరీ వేయబోతోంది? దర్యాప్తు అధికారాన్ని తన పరిధిలోనే ఉంచుకుంటుందా? లేక బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు సీబీఐకి అప్పగిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడి పేషీలో అరాచకాలు జరిగిపోతున్నాయా? వాటన్నిటికీ కారణం ఒకే ఒక్కడా? విషయం తెలిసినా, ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా... మంత్రి ఆయన్ని ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నారు? ఇద్దరి మధ్య అంత అనుబంధం ఏంటి? పైగా అచ్చెన్నాయుడు ఈ విడత మంత్రి అయ్యాక సదరు వ్యక్తిని ఏరికోరి పేషీలోకి తెచ్చుకున్నారన్నది నిజమేనా?