ఆ నాయకుడికి టికెట్ చేజారిపోయిందా?నామినేటెడ్ పదవి వద్దనుకున్నారా? చివరకు ఆయనకు దక్కింది ఏమిటి? సొంత నియోజకవర్గంలో పదవులు వదులుకుని, పక్క నియోజకవర్గంలో ఇల్లీగల్ వ్యాపారం ఎంచుకోవడానికి కారణమెంటి? అక్రమ వ్యాపారం లాభసాటిగా సాగడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూనే… గతంలో పార్టీ కోసం ఖర్చు చేసిన. డబ్బులు రాబట్టుకుంటున్నారా? టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇసుకాసురుడిగా. మారారట. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల ఇసుక స్టాక్ పాయింట్‌కు కుందుల కింగ్ మేకర్.…
Off The Record : తెలంగాణ ప్రభుత్వ పెద్దలు,కాంగ్రెస్ నేతలు.. చేసింది కూడా చెప్పుకోలేక పోతున్నారా..? మంచి చేసిన చెప్పుకోలేకపోవడంతో ప్రత్యర్థులు చేసే ప్రచారమే పైచేయిగా మారుతుందా? చెప్పేవాళ్లు లేకనా… ఏమవుతుందిలే అని వదిలేస్తున్నారా..? పదేపదే అదే లోపం కనిపిస్తోందా?. ఇంతకీ ఆ లోపమెక్కడుంది?చేసింది ఏమీ లేకపోతే చెప్పుకోకపోవడం అనేది ఉండదు.. ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి. కానీ చేసింది మంచి పని అయినా చెప్పుకోలేకపోతోంది ప్రస్తుత ప్రభుత్వం. చేసింది చెప్పుకునే వరకు ప్రతిపక్షం దాన్ని…
కొద్దిరోజుల క్రితం మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సమీప భవిష్యత్తుపై భరోసా లేని రాజకీయం నడుస్తున్న ఈరోజుల్లో ఏకంగా 2047 దాకా మోడీనే దేశానికి ప్రధానిగా ఉంటారన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ అంశంపై ప్రాక్టికల్ పాజిబులిటీ గురించి ఎలాగో అభిప్రాయాలు వస్తున్నాయి. అప్పటిదాకా ఉండేదెవరు, ఊడేదెవరూ అనే కామెంట్లు…
కూటమి ప్రభుత్వంలో ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ పోటీ పడ్డారా? నా మనిషికి కావాలంటే… నా మనిషికి అంటూ… వత్తిడి పెంచారా? మాంఛి సినిమా కథను తలపించిన ఆ ఎపిసోడ్లో చివరికి బాలయ్యదే పైచేయి అయిందా? రెండు పెద్ద తలకాయలు అంతలా తలపడ్డ ఆ పోస్ట్ ఏది? డిప్యూటీ సీఎంను కాదని ఎమ్మెల్యే మనిషికి ఎలా ఫైనల్ అయింది? ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ముఖ్యమైన దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్స్‌ను నియమించింది. శ్రీశైలం,…
ఇరకాటంలోపడ్డానని డిసైడైపోయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అదవుతుందని అనుకుంటూ… అటాకింగ్ మోడ్‌లోకి వచ్చేశారా? పాలిటిక్స్‌లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా ఒంటబట్టిండుకున్న సదరు లీడర్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలంటూ కొత్త రాగం అందుకున్నారా? తన రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళని కూడా వాడేస్తున్నాడా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన మొదలుపెట్టిన నయా రాజకీయం ఏంటి? మంథని నియోజకవర్గం… గోదావరి తీరాన్ని అనుకుని ఓ మూలన ఉన్నా…పొలిటికల్‌గా ఎప్పుడూ అందరి నోళ్లలో నానుతూ ఉండటం ఈ మంత్రపురి…
ఆ మంత్రి గారి పుట్టినరోజు వేడుకలు కూటమిలో కుంపట్లు రాజేశాయా? ఏకంగా రెండు నియోజకవర్గాల్లో అగ్గి అంటుకుందా? ఇన్నాళ్ళు అంతర్గతంగా రగిలిపోతున్న రెండు వర్గాలు దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇప్పుడు చెలరేగుతున్నాయా? మంత్రి బర్త్ డే అయితే… కూటమి కేడర్ కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పుట్టిన రోజు వేడుకలు తూర్పుగోదావరి జిల్లా కూటమిలో చిచ్చుపెట్టాయట. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం ఉన్న రెండు అసెంబ్లీ…
తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా? సీనియర్స్ ఎక్కువ మంది ఇప్పటికీ అలకపాన్పులు దిగలేదా? పదవులు రాలేదన్న బాధ ఒకరిదైతే… వచ్చిన వాళ్ళతో సైతం అసంతృప్తులు పెరుగుతున్నాయా? గతంలో రెగ్యులర్‌గా పార్టీ ఆఫీస్‌కు వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు గేటు దగ్గరికి కూడా ఎందుకు రావడం లేదు? పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తుల పర్వానికి తెర లేచింది. ఆ విషయమై పార్టీలో ఆనందించే వారికంటే… ఇప్పుడు ఆవేదనతో…
ఆ వైసీపీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిస్తే…. ఆయన నియోజకవర్గాన్ని వదిలి విజయవాడలో ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి హాజరవకూడదనన్న వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆయనకు మింగుడు పడటం లేదా? శాసనసభ్యుడి కదలికల మీద స్వపక్షం, అధికారపక్షం ఓ కన్నేసి ఉంచాయా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్పెషల్ స్టోరీ? రేగం మత్స్యలింగం….అరకు ఎమ్మెల్యే. 2024లో కూటమి దూకుడుని తట్టుకుని వైసీపీ గెలిచిన 11మందిలో ఒకరు. టీచర్ టర్న్డ్ పొలిటీషియన్ ఈయన. గత ఎన్నికలకు…
ఆ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల విన్యాసాలు చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారా? క్రెడిట్ వార్‌లో పడుతున్న పాట్లు చూసి… వీళ్ళెక్కడ దొరికార్రా నాయనా… ఆళ్లనెవరికన్నా చూపించండర్రా అని అంటున్నారా? అయినా సరే… తగ్గేదేలే, సిగ్గుపడేదేలే అంటున్న ఆ నాయకులెవరు? అసలు ఏ విషయంలో పోటీపడి పరువు తీసుకుంటున్నారు? మంచిర్యాల జిల్లాలో వందేభారత్ రైలు హాల్ట్ కావాల్సినంత పొలిటికల్ కలర్ పులుముకుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. తాము ప్రయత్నం చేస్తేనే ఇక్కడ వందేభారత్ రైలును…