Drug Injection Scam: పాతబస్తీలో జోరుగా మత్తు ఇంజక్షన్ల దందా జోరుగా కొనసాగుతుంది. మత్తు ఇంజక్షన్ దందాపై ఎన్టీవీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అనస్థీషియా డ్రగ్ తీసుకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. మత్తు ఇంజెక్షన్ల ఓవర్ డోస్ తో యువకులు చనిపోయినట్లు పోలీసులు తేల్చారు. డబ్బులకు కక్కుర్తి పడి మత్తు ఇంజక్షన్లని డాక్టర్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క అనస్థీషియా మత్తు ఇంజక్షన్లు వెయ్యి రూపాయల చొప్పున యువకులు కొనుగోలు చేస్తున్నారు.
Read Also: CMR Shopping Mall: రాజాంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్ ఘన ప్రారంభం..
అయితే, ఆటో డ్రైవర్లు, విద్యార్థులే అనస్థీషియా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్టీవీ ఆపరేషన్ లో మత్తు ఇంజెక్షన్ల దందా బయటపడింది. మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా యువకులు చిక్కారు. పోలీసులు- డ్రగ్ కంట్రోల్ అధికారుల జాయింట్ ఆపరేషన్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అనస్థీషియా డ్రగ్స్ ఇంజక్షన్లు అమ్ముతున్న ఇద్దరు డాక్టర్లతో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.