PFI Training: పీఎఫ్ఐ ట్రైనింగ్ పేరుతో ఉగ్రకార్యకలాపాలు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI Training: నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు కలకలం రేపుతున్నాయి. నిషేధిత సిమీ అనుబంధ సంస్థ ‘పీఎఫ్‌ఐ’ కరాటే ట్రైనింగ్ పేరుతో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ట్రైనింగ్ పేరిట పీఎఫ్ఐ మత ఘర్షణల కుట్రకు తెరలేపిందని పోలీసులు నిర్ధారించారు. 28 మంది నిందితులను గుర్తించి నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పీఎఫ్‌ఐ ఆర్గనైజేషన్ పేరుతో మరో 8 సంస్థలు నడుపుతున్నట్లు గుర్తించారు. గతంలో నిజామాబాద్‌లోని ఆటోనగర్‌లో ట్రైనింగ్ కేంద్రం దాడి చేసి పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అప్పుడు పీఎఫ్‌ఐ ట్రైనర్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్ రిపోర్టు ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పీఎఫ్‌ఐ ఆర్గనైజేషన్ నడుపుతున్న 8 సంస్థల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ విమెన్ ఫ్రంట్ ఉన్నట్లు గుర్తించారు. పీఎఫ్‌ఐ ప్రధాన ఉదేశం ఆక్టివ్ ముస్లిమ్స్‌కి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇతర మతాలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడమని రిమాండ్ రిపోర్టు ద్వారా తెలిసింది. ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం స్టోన్ ఫెల్టింగ్, కత్తులతో శిక్షణ ఇస్తూ యువకులను పీఎఫ్ఐ రెచ్చగొడుతోంది. సోషల్ వర్క్ పేరుతో ఫండ్స్ వసూలు చేసి క్యాడర్‌ను పెంచుతోంది. డివిజన్, రీజినల్, స్టేట్ క్యాడర్‌తో రెగులర్ మీటింగ్ పెడుతోంది. స్కూల్, కాలేజ్, మదర్సా, మస్జీద్, మోహల్లాస్‌లో గ్రౌండ్ లెవెల్‌లో యువకులను రిక్రూట్ చేయాలని పీఎఫ్ఐ పథకం వేసింది.
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
CI Nageshwar Rao Case: వివాహితపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు
మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణనిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. జిల్లాలో పీఎఫ్ఐ ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుందనే దానిపై ఆరా తీస్తున్నారు. యువత ఆసక్తి చూపవద్దని, సంయమనం పాటించాలని సూచించారు. గత సంవత్సరం బోధన్‌లో ఒకే అడ్రస్ పై బంగ్లాదేశీయులకు 72 పాస్ పోర్టులు జారీ అయిన సంగతి తెలిసిందే. గతంలో బోధన్ లో ఉగ్ర కదలికలు వెలుగు చూశాయి. సౌదీలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారు. ఉగ్రవాదులతో లింకులున్నాయని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..