Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Politics In Balkonda Bjp

Balkonda BJP : బాల్కొండ బీజేపీలో వర్గపోరు

Published Date :July 22, 2022 , 4:52 pm
By Premchand Chowdary
Balkonda  BJP : బాల్కొండ బీజేపీలో వర్గపోరు

Politics In Balkonda BJP :

హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభ జరిగి రోజులు గడుస్తున్నాయి. ఆ సభకు సంబంధించిన ప్రకంపనలు మాత్రం ఆ నియోజకవర్గంలో ఓ రేంజ్‌లో ఉన్నాయట. పాత, కొత్త కేడర్‌ మధ్య అగ్గి ఎగిసిపడి.. షోకాజ్‌ నోటీసుల వరకు సమస్య వెళ్లిందట. ముఠా తగాదాల తీవ్రత శ్రుతిమించి.. కమలనాథులను కలవర పెడుతోందట.

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బీజేపీలో చాపకింద నీరులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. ఇక్కడ పార్టీ ఇంఛార్జ్‌ రుయ్యాడి రాజేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణ తనయుడు మల్లికార్జునరెడ్డి మధ్య అస్సలు పొసగడం లేదు. పార్టీ కేడర్‌ కూడా కొత్త, పాత అని చీలిపోయింది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభ తర్వాత ఆ పోరు మరింత శ్రుతిమించినట్టు టాక్‌. ప్రధాని సభకు రాజేశ్వర్ కొందరిని తీసుకెళ్లారు. వారికి ఆరెంజ్‌ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి గ్యారేజీలో భోజనం పెట్టించారట. ఈ విషయాన్ని మల్లికార్జున్ రెడ్డి.. పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో.. షోకాజ్‌ నోటీసులు జారీ చేశారట. ఆ నోటీసే బాల్కొండ బీజేపీలో అగ్గి రాజేస్తోంది.

జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎలా షోకాజ్‌ నోటీసు ఇస్తారని ప్రశ్నిస్తూ.. రాజేశ్వర్‌ వర్గం తిరుగుబాటుకు రెడీ అవుతోందట. ప్రస్తుతం రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. మల్లికార్జునరెడ్డికి బీజేపీలో ఒక ముఖ్యనేత మద్దతు ఉందని.. అందుకే పాత కేడర్‌ను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలకు చెప్పేందుకు పాత నేతలు రెడీ అవుతున్నారట. గతంలో మల్లికార్జునరెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ఆడియోలను వైరల్‌ చేస్తున్నారట.

టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి మల్లికార్జునరెడ్డి తానే అభ్యర్థిననే ప్రచారం మొదలు పెట్టారు. ఆ మేరకు పార్టీలో హామీ లభించిందని చర్చలో పెడుతున్నారు. గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత సునీల్‌రెడ్డి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆయన రాకను మల్లికార్జునరెడ్డి, జిల్లాలో మరో నేత అడ్డుకుంటున్నారట. సునీల్ రెడ్డి రెండుసార్లు బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనా.. చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అయ్యిందట.

ఇదే సమయంలో ఆరెంజ్‌ ట్రావెల్స్ గ్యారేజీలో భోజనాలు చేయడం వివాదానికి కారణమైంది. బాల్కొండ నుంచి రెండుసార్లు బీజేపీ నుంచి పోటీ చేసిన రాజేశ్వర్‌ను సాగనంపే కుట్రలు చేస్తున్నారని ఆయన వర్గం అనుమానిస్తోంది. దీనిపైనే రెండువర్గాలు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటున్నాయి. సమస్య వేడి హైదరాబాద్‌ వరకు తాకిందట. బాల్కొండ పరిణామాలపై రాష్ట్ర నేతలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. వివాదాలకు, విభేదాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. అయితే ఆ హెచ్చరికలు చెవికి ఎక్కలేదో ఏమో.. కయ్యానికి కాలు దువ్వడానికి వెనకాడటం లేదు స్థానిక బీజేపీ నేతలు. మరి.. వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర నేతలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

 

ntv google news
  • Tags
  • Armoor MLA Annapurna
  • Balkonda BJP
  • Mallikarjuna Reddy
  • Nizamabad
  • orange travels

WEB STORIES

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

"మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?"

Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

"Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?"

తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?

"తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?"

RELATED ARTICLES

Crime News: భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య

Off The Record: బీజేపీలో ముగ్గురు నేతల మూడుముక్కలాట

Fake Visa: వీసాల పేరిట భారీ మోసం.. 2 కోట్లతో ఏజెంట్ పరార్‌

Off The Record about Madhu Yaskhi: మధుయాష్కీపై నేతల గుర్రు.. కాంగ్రెస్‌ నేతల తీరుపై కొత్త రచ్చ..!

Loan Money is Theft: ఫాలో అయ్యారు.. 13లక్షల డబ్బులు కొట్టేసారు

తాజావార్తలు

  • Nandamuri Taraka Ratna: ఆస్పత్రికి వచ్చినప్పుడు తారకరత్నకు పల్స్‌ లేదు-వైద్యులు

  • Identical Twins: కవలల వింత కోరిక.. ఒకేసారి ఒక్కరితోనే గర్భం దాలుస్తారట..

  • Nandamuri Taraka Ratna: లోకేష్‌ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత

  • Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి

  • TTD Mobile App: టీటీడీకి కొత్త యాప్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సేవలు

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions