నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై లారీ ఆగివుంది. జగిత్యాల నుంచి ఇద్దరు వ్యక్తులు ఆర్మూర్ వైలుతున్న ఆల్టో కారు ఢీ కొట్టంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కారులో వున్న ఇద్దరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నవారు కాపాడండి అంటూ కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కారులో వున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. కారు నెంబర్ ఆధారంగా వేల్పూరు ఎస్.ఐ. వినయ్ మృతుల వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా ఈఘటన ఆదివారం అర్థరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో చోటుచేసుకుందని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులు జగిత్యాల జిల్లా వాసులుగా గురత్ించారు.
ATA Celebrations 2022: జోరుగా ‘ఆటా’ మహాసభల ఏర్పాట్లు..