Muslim Woman Translated Bhagavad Gita : దేనికైనా మతంతో సంబంధం వుండదు. అందరూ సమ్మతమే. మనం అనే భావన మనందరిలో వుంది కాబట్టే మన మందరం భారతీయులం. కులం, మతం వేరేమి కాదు. కులమతాలకు అతీతంగా అందరూ దేవుడికి సమానమే. ఏ పండగ వచ్చినా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటుంటారు. అదే మన భారత దేశం. అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతూ మనుషులంతా ఒక్కటే.. కులం, మతం అనే తేడా లేదంటూ కలిసి కట్టుగా ఒకే కుటుంబంగా జీవిస్తున్నాం. అలాంటి వాటిలో ఓ ముస్లీం మహిళ తన పరిజ్ఙానంతో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుంది. ఇంతకీ ఆమో ఏం చేసిందో ఒక్కసారి చూద్దాం. అమె జన్మతా ముస్లిం, అయితే ఆమె పఠనం కేవలం ఖురాన్‌తోనే ఆగిపోలేదు, మిగతా మతాల పవిత్ర గ్రంథాలను కూడా అధ్యయనం చేసింది.. హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను కూడా ఆమె ఔపోసణ పట్టడమే కాదు.. ఆ గ్రంథాన్ని ఉర్దూలోకి అనువదించింది. కొద్ది కాలంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసింది. ఆ యువతి పేరు హిబా ఫాతిమా. మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేటకు చెందిన చిరు వ్యాపారి అమేద్ ఖాన్ కుమార్తె. అయితే.. సంస్కృతంలోని భగవద్గీతను అతి తక్కువ సమయంలో ఉర్దూలోకి అనువదించడం ద్వారా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన హెబాఫాతిమా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు.
ఫాతిమా రాకాసిపే టకు చెందిన ఆమె మూడు నెలల కాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. కాగా.. హెబా కళాశాల స్థాయిలో ఉన్నప్పుడు భగవద్గీత శ్లోకాలు.. ఖురాన్ సూరాలు చదివేవారు.. ఈ రెండింటిలో సారూప్యత ఉన్న అంశాలతో గతంలో ఉర్దూలో పుస్తకం రాశారు. అయితే.. తాజాగా భగవద్గీతను ఉర్దూలోకి అనువదించి, అన్నింటిని పూర్తిగా చదివి, తన వయస్సు వారికి అర్థమయ్యేలా ఉర్దూలోకి అనువాదం చేసింది. అంతేకాదు.. మానవత్వమే మనిషి తత్వమని అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేయమని తన తండ్రి చేసిన సూచనతోనే ఇతర మతాల సారాన్ని తెలుసుకునేందుకు నడుం బిగించానని చెబుతోంది. చాలా కొద్ది కాలంలోనే ..మూడు నెలల్లో భగవద్గీతలోని మొత్తం ఏడువందల శ్లోకాలు 18 అధ్యయనాలను ఆమె ఉర్దూలోకి అధ్యయనం చేసింది. ఇక శ్లోకాలను ఉర్దూలో రాసే సమయంలో ఎన్నో సమష్కాలను ఎదురయ్యాయని, ఒక పదానికి అర్థం వెతికేందుకు చాలా సమయం పట్టిందని హిబా తెలిపారు. ఇక భగవద్గీత ఖురాన్ లోని సారూప్యతను తెలియజేస్తూ సిమిలారిటీస్ బిట్వీన్ భగవద్గీత ఖురాన్ అనే పుస్తకాన్ని హిబా రాస్తోంది. దీంతో.. రెండు గ్రంథాల సారాంశాన్ని వివరించడానికి మెసేజ్ ఫర్ ఆల్ అనే యూట్యూబ్ అనే ఛానెల్‌ను నిర్వహిస్తోంది, ఇందులో ఇప్పటి వరకు 80 వీడియోలను అప్‌లోడ్ చేసి, మానవత్వమే ప్రధాన మతమని వివరిస్తూ భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్టు వెల్లడించింది హిబా. ప్రతి ఒక్కరికి మతంతో కాదు మానవత్వంతో చూడాలని నిరూపిస్తు హిబాకు మంచి స్థానాన్ని సంపాదించాలని మనం కోరుకుందా.
Snake Man Passes Away: విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి