NIA inspections: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. నిజామాబాద్‌లోనే 22 మందిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA inspections: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపింది.. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడపా, గుంటూరులో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే.. పీపుల్స్ ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఇక ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక.. నిజామాబాద్‌లో ఛారిటీ పేరుతో ఫండ్స్ వసూలు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్నారన్న కారణంతో సయ్యద్ షాహిద్‌కు ఎన్ఐఏ నోటీసులు అందించింది.
అయితే.. గత నెల 28న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు.. ఈ నెల 19న హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు చేశారు. ఇక నిజామాబాద్‌లో అబ్ధుల్ ఖాదీర్ నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి 200 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో.. కేరళ, ఢిల్లీ, కర్ణాటకలతో కూడా పీఎఫ్ఐ కార్యకలాపాలు ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అంతేకాకుండా.. నిర్మల్ జిల్లా బైంసాలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక మదీనా కాలనీలో అధికారులు సోదాలు చేపడుతున్నారు.. ఈనేపథ్యంలో.. రాత్రి మూడు గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఇక పీపుల్స్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతోనే ఈ దాడులు నిర్వహించి అనుమానితులను అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!