TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) రాత పరీక్షలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన వివరాలు తప్పుగా నమోదు చేశానని.. ఓ అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీటునే మింగేశాడు. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో జరిగింది.
కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నిజామాబాద్ లోని ఓ మేడికో ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య సంచలనంగా మారింది.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇవాళ నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించనున్నారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ ఆవరణలో కొత్త నిర్మస్తున్న కళాభారతికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
Crime News: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను రోకలిబండతో కొట్టి చంపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో భర్త తుమ్మల వెంకట్ రెడ్డిని రోకలిబండ తో తల పై బాది భార్య రుక్మవ్వ హత్య చేసింది.
నిజమాబాద్ జిల్లాలో షేక్ బషీర్ అనే ఏజెంట్ ప్రతక్షమయ్యాడు. 6 నెలల క్రితం ఆర్.కె. ట్రావెల్స్ పేరుతో గల్ఫ్ ఏజెంట్ అవతారం ఎత్తాడు. గల్ఫ్ దేశాలకు పంపిస్తానని నమ్మబలికాడు. మీకష్టలు రాకుండా అక్కడి వెళ్లి పనిచేసుకుంటే మంచి జీవితాన్ని అనుభవిస్తారని నమ్మబలికాడు. అది నమ్మని నిరుద్యోగులు కొందరు అతనికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు.
మధుయాష్కీ. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్. గతంలో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఉన్న జిల్లా నిజామాబాద్. యాష్కీతోపాటు మరో ఇద్దరు కీలక నేతలుకు పీసీసీలో పదవులు ఉన్నాయి. కానీ.. నాయకులంతా ఎవరికివారే. ఇటీవల టీపీసీసీ కమిటీ కూర్పు రాష్ట్రస్థాయిలో నేతలను రెండుగా చీల్చేసింది. మీడియా ముందు ఓపెన్గానే విమర్శలు.. సవాళ్లు చేసుకున్నారు నేతలు. ఆ సమస్యపై కాంగ్రెస్ హైకమాండ్ చికిత్స చేస్తున్నా.. పీసీసీ…
తెలంగాణ రాష్ట్రంలో వరుస దొంగతనాలు ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మొన్న నాగోల్ స్నేహపురి కాలనీలో బంగారం చోరీ ఘటన.. నిన్న బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ సైట్-2లో భారీ చోరి.. నేడు నిజామాబాద్ జిల్లా లోని సినీ పక్కిలో 13 లక్షలు చోరీ వరుస ఘటనలు సంచలనంగా మారాయి.
బీఆర్‌ఎస్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదల కోసమేనని అన్నారు.