Another New Mandal in Telangana: తెలంగాణలో మరో కొత్త మండలం ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో మండల కేంద్రంగా పోతంగల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేసన్ జారీ చేసింది. 14 గ్రామాలతో పోతంగల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అభ్యంతరాలు వినతులను 15 రోజుల్లోపు నిజామాబాద్ కలెక్టర్ కు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోరింది. రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం (26) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల అవసరాలు, పరిపాలనలో సౌలభ్యం కోసం మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు. తెలంగాణలో నూతన మండలాలు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మండల కేంద్రంగా పోతంగల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా ఏర్పడనున్న మండలాలు:
*జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం,
*సంగారెడ్డి- నిజాంపేట్,
*నల్గొండ- గట్టుప్పల్,
*మహబూబాబాద్- సీరోలు, ఇనుగుర్తి,
*సిద్దిపేట అక్బర్పేట-భూంపల్లి, కుకునూరుపల్లి,
*నిజామాబాద్ ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా,
*కామారెడ్డి డోంగ్లి,
*మహబూబ్ నగర్- కౌకుంట్ల మండలాలు ఏర్పాటయ్యాయి.
National Games 2022: నేటి నుంచే జాతీయ క్రీడలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ